అనుష్కకు స్పెషల్‌ గిఫ్ట్‌! | Anushka Sharma got a beautiful gift from fashion designer Sabyasachi | Sakshi
Sakshi News home page

అనుష్కకు స్పెషల్‌ గిఫ్ట్‌!

Nov 26 2020 8:51 PM | Updated on Nov 26 2020 9:12 PM

Anushka Sharma got a beautiful gift from fashion designer Sabyasachi - Sakshi

త్వరలో అమ్మ అవబోతున్న అనుష్క శర్మకు ప్రముఖ బాలీవుడ్‌ డిజైనర్‌ సబ్యసాచి సర్‌ప్రైజ్‌ గిఫ్టిచ్చాడు. ప్రత్యేకంగా కొన్ని నగలను డిజైన్‌ చేయడమే కాకుండా భర్త విరాట్‌ కోహ్లి, తన పేర్లలోని మొదటి అక్షరాలు (ఏ,వి) వచ్చేలా ఒక నెక్లెస్‌ కూడా తయారు చేసి, ‘‘మీ ఇద్దరికీ కంగ్రాట్స్‌. మీకు మా ప్రేమ!’’ అని రాసిన నోట్‌తో పాటు అనుష్కకు పంపించాడు. వాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న అనుష్క ‘‘కళాకోవిదుడు (మాస్ట్రో)’’ అంటూ సబ్యసాచిని ఆకాశానికెత్తేసింది.

అనుష్క-విరాట్‌ ల పెళ్లి దుస్తుల డిజైనర్‌ కూడా సబ్యసాచే అవడం గమనార్హం. అప్పట్లో వాటికి మంచి పేరొచ్చింది. దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రా ల పెళ్లి దుస్తులు సైతం సబ్యసాచి రూపొందించినవే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement