పాడు సంబంధాల అధికారి! | - | Sakshi
Sakshi News home page

పాడు సంబంధాల అధికారి!

Nov 26 2026 12:06 AM | Updated on Nov 26 2026 12:06 AM

● దిగువ స్థాయి ఉద్యోగుల జీతం నుంచి లంచం ● ప్రతి నెలా చెల్లింపులు, లేదంటే వేధింపుల పర్వం ● కూతురి వయసున్న మహిళపై లైంగిక వేధింపులు ● ఫిర్యాదు కోసం ఐడీఓసీకి వచ్చిన బాధితురాలు

సీఎంకు చెప్పుకో..

మసాజ్‌ చేయాలి

జిల్లా పౌర సంబంధాల కార్యాలయంలో సరికొత్త అవినీతి పర్వం, లైంగిక వేధింపుల అంశం వెలుగు చూసింది. తనకు డీపీఆర్‌ఓ వేధింపుల నుంచి రక్షణ కావాలంటూ బాధిత మహిళ ఐడీఓసీ క్యాంపస్‌లో బుధవారం కన్నీటి పర్యంతమైంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
● దిగువ స్థాయి ఉద్యోగుల జీతం నుంచి లంచం ● ప్రతి నెలా చెల్లింపులు, లేదంటే వేధింపుల పర్వం ● కూతురి వయసున్న మహిళపై లైంగిక వేధింపులు ● ఫిర్యాదు కోసం ఐడీఓసీకి వచ్చిన బాధితురాలు

తెలంగాణ సాంస్కృతిక సారథి

తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వ కార్యక్రమాల ప్రచా రం కోసం తెలంగాణ సాంస్కృతిక సారథి (టీఎస్‌ఎస్‌) సంస్థ ఏర్పాటు చేశారు. టీఎస్‌ఎస్‌ కళాకా రుల బృందాలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల్లో అవగాహన, చైతన్యం నింపే కళారూపాలను ప్రదర్శిస్తున్నాయి. ఆరంభంలో కళాకారుల హాజరు నమోదు యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో జరి గేది. మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్స్‌ సమస్య వల్ల 2024 జూన్‌ నుంచి మ్యానువల్‌ విధానంలో హాజరు నమోదు చేస్తున్నారు. డీపీఆర్‌ఓ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. మ్యానువల్‌ అటెండెన్స్‌ను అధారంగా చేసుకుని సాంస్కృతిక సారథి సభ్యుల జీతం నుంచి ప్రతీనెల రూ.1000 వరకు తనకు ముట్టజెప్పాలని డీపీఆర్‌ఓ అజ్గర్‌ వేధిస్తున్నట్టు టీఎస్‌ఎస్‌కు చెందిన ఓ మహిళా కళాకారిణి ఆరోపిస్తున్నారు. సదరు మహిళ వ్యక్తిగత

గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఆమె పేరు వెల్లడించడం లేదు.

లంచం ఇస్తే చాలు

డీపీఆర్‌ఓ అజ్గర్‌కు నోట్ల మూటలు సమర్పిస్తే విధులకు హాజరు కాకపోయినా అటెండెన్స్‌ వేయడం పరిపాటిగా మారింది. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉండి ఒక నెల లంచం ఇవ్వకపోతే తదుపరి నెలలో సదరు కళకారుడికి అటెండెన్స్‌లో కోతపెట్టడం తద్వారా జీతం కట్‌ చేయించడం అజ్గర్‌ నైజంగా మారింది. కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చిన తర్వాత నెలకు రూ.25 వేలుగా ఉన్న కళాకారుల జీతాన్ని రూ.32 వేలకు పెంచింది. దీనికి తగ్గట్టే అజ్గర్‌ సైతం తన లంచం వాటాను రూ.700 నుంచి రూ.1,000కి పెంచినట్టు బాధిత కళాకారిణి ఆరోపిస్తోంది.

అందుబాటులోకి రాని వైనం

టీఎస్‌ఎస్‌కు చెందిన మహిళా కళాకారిణి చేసిన అవినీతి, లైంగిక ఆరోపణలపై డీపీఆర్‌ఓ అజ్గర్‌ను వివరణ కోసం ఫోన్‌లో ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ విషయంపై అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌ను వివరణ కోరగా.. ఫిర్యా దు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్‌ అంకిత్‌ స్పందన కోసం ప్రయత్నించగా చర్ల పర్యటనలో ఉన్నానని, డీపీఆర్‌ఓ అంశం తన దృష్టికి రాలేదని చెప్పారు.

డీపీఆర్‌ఓ అజ్గర్‌ వేధింపులు భరించలేక

కలెక్టర్‌ అంకిత్‌కు రాతపూర్వక ఫిర్యాదు

చేసేందుకు బాధిత మహిళ బుధవారం జిల్లా అధి కారుల సమీకృత కార్యాలయానికి వచ్చింది. ఆరోపణలకు తగ్గ ఆధారాలు (కాల్‌ రికార్డులు, చాటింగ్స్‌, ఫోన్‌పే చెల్లింపులు) తదితర వివరాలు వెంట తెచ్చుకుంది. విషయం తెలిసిన డీపీఆర్‌ఓ ఆమె వద్దకు వెళ్లి ‘కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే ఏమొస్తుంది? సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేయి’ అని గడ్లురిమి చూసినట్టు బాధితురాలు చెబుతోంది. నేను మీడియా వాళ్లకు విషయం చెబుతాను అంటే ‘ప్రెస్‌లో పని చేసే వాళ్లు, వారి పనుల కోసం నా ముందు చేతులు కట్టుకుంటారు. వాళ్లతో నాకు వచ్చే నష్టం ఏమీ లేదు’ అంటూ

మరింతగా బెదిరించినట్టు ఆమె చెబుతోంది.

డీపీఆర్‌ఓ అజ్గర్‌ వేధింపులతో బెదిరిపోయిన బాధితురాలు కలెక్టరేట్‌ ఆవరణలోనే ఏడుస్తుండడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అధికార హోదాను అడ్డుగా పెట్టుకుని టీఎస్‌ఎస్‌లో ఉన్న తనపై డీపీఆర్‌ఓ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సదరు మహిళ ఆరోపణలు చేసింది. ‘నా భార్య ఇంట్లో లేనప్పుడు ఇంటికి రా’, ‘నాకు నీతో మసాజ్‌ చేయించుకోవాలని ఉంది అని అనేక రకాలుగా వేధింపులకు పాల్పడ్డారు’. ‘మీరు, మా సార్‌.. అలా మాట్లాడకూడదు’, ‘నా తండ్రి లాంటి వారు’ అని సదరు బాధిత మహిళ పలుమార్లు సున్నితంగా హెచ్చరించినా అతని వంకర బుద్ధి మారలేదు సరికదా మరింత ఎక్కువైంది. 2026 సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ వరకు అటెండెన్స్‌ రికార్డులను అడ్డుపెట్టుకుని ప్రతీ నెల రూ. 7,000 కోత పెట్టడం మొదలు పెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement