ఎట్టకేలకు హెచ్‌ఆర్‌ఏ మంజూరు | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు హెచ్‌ఆర్‌ఏ మంజూరు

Nov 26 2026 12:06 AM | Updated on Nov 26 2026 12:06 AM

పాల్వంచ: కేటీపీఎస్‌ 7వ దశ ఉద్యోగుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. శిథిలావస్థకు చేరిన డిపార్ట్‌మెంట్‌ క్వార్టర్లను ఖాళీ చేసి అద్దె ఇళ్లల్లో ఉంటున్న వందలాది మంది ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం(హెచ్‌ఆర్‌ఏ) చెల్లించేందుకు జెన్‌కో యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. 7వ దశ పరిధిలో క్వార్టర్లు ఖాళీ చేసిన 176 మంది ఉద్యోగుల్లో కేవలం పైరవీలు చేసుకున్న 14 మందికి మాత్రమే యాజమాన్యం హెచ్‌ఆర్‌ఏ విడుదల చేయడంతో మిగిలిన వారిలో అసంతృప్తి నెలకొంది. ఈ సమస్యపై గత అక్టోబర్‌ 2న సాక్షి పత్రికలో ‘హెచ్‌ఆర్‌ఏ.. కొందరికేనా?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో మరుసటి రోజే జెన్‌కో డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌, ఐఆర్‌) ఎస్‌వీ.కుమార్‌ రాజ్‌ స్పందించి హెచ్‌ఆర్‌ఏ అందరికీ ఇవ్వాలని జీఓజారీ చేశా రు. సివిల్‌ విభాగం అధికారుల ధ్రువీకరణ ఆధారంగా హెచ్‌ఆర్‌ఏ మంజూరు చేయాలని సూచించా రు. ఈ నేపథ్యంలో అర్హులను గుర్తించి హెచ్‌ఆర్‌ఏ వర్తించేలా సీఈ ఎం.ప్రభాకర్‌ రావు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

ఉద్యోగుల్లో హర్షం

తాజా నిర్ణయంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న సుమారు 100 మందికి హెచ్‌ఆర్‌ఏ ఈ నెల నుంచే అందనుంది. మిగిలిన వారు సైతం దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా వర్తింపజేస్తామని సీఐ తెలి పారు. కాగా, పాత క్వార్టర్ల స్థానంలో కొత్త క్వార్టర్ల నిర్మాణ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. అవి అందుబాటులోకి వచ్చేవరకు హెచ్‌ఆర్‌ఏను అందించనున్నారు.

జెన్‌కో ఆదేశాలతో

కేటీపీఎస్‌ 7వ దశ ఉద్యోగులకు ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement