భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం కృత్తికా దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేకపూజలు, స్నపన తిరుమంజనం వేడుకగా జరిపారు. తొలుత ఆల య ప్రాంగణంలో వేదికపై స్వామి వారినికొలువుదీర్చారు. అనంతరం అర్చకులు ప్రత్యే క పూజలు నిర్వహించి, కలశాలతో స్నపన తిరుమంజనం, పంచామృతంతో అభిషేకం జరిపారు. ఆ తర్వాత స్వామి వారికి హారతి సమర్పించారు. కృత్తికా దీపోత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం హోమం నుంచి తీసుకొచ్చిన పవిత్ర జ్వాలతో దీపాలను వెలిగించారు. పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతిఏటా రామాలయంలో ఈ దీపోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా చొక్కొసుర వధ దహనం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేడుకల్లో ఆలయ అర్చకులు, వేదపండితులు, దేవస్థానం సిబ్బంది, భక్తులుపాల్గొన్నారు. కృత్తికా దీపోత్సవం సందర్భంగా నిలిపివేసిన నిత్యకల్యాణం గురువారం నుంచి యథావిధిగా కొనసాగనుంది.
నేడు మెగా జాబ్ డ్రైవ్
అశ్వాపురం: భద్రాచలం ఐటీడీఏ యూత్ ట్రైనింగ్ సెంటర్, ఏఎఫ్‌సీ ఇండియా లిమిటెడ్ సహకారంతో మండల పరిధిలోని మిట్టగూడెంలోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల బాలుర డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ బండారుపల్లి రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రోన్ పైలట్ కమ్ టెక్నీషియన్, జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల కోసం జాబ్‌డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నా రు. 10వ తరగతి నుంచిడిగ్రీ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు సంబంధించిన అర్హతల మేరకు పాల్గొనవచ్చని వివరించారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, బయోడేటా, పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను తెచ్చుకోవాలని సూచించారు.
మెరుగైన
వైద్యసేవలందించాలి
భద్రాచలంఅర్బన్: బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు నాయక్ సూచించారు. బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో తనిఖీ చేశారు. పలు వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించా రు. వైద్యులతో సమావేశమై విధి సమయాలు, వార్డుల పర్యవేక్షణపై సమీక్షించారు. టీ–హబ్ ఏర్పాటు చేయనున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కానింగ్ విభా గం వెలుపల రోగులు నిరీక్షించే ప్రదేశాన్ని విస్తరించాలని, రోగులు క్యూలో నిల్చోకుండా టోకె న్ విధానం అమలు చేయాలన్నారు. పరిపాలనా సామర్థ్యం, ఆసక్తి, అత్యవసర పరిస్థితుల ను సమర్థంగా ఎదుర్కొనే నైపుణ్యం ఉన్న వైద్యులను గుర్తించి అదనంగా నలుగురు ఆర్‌ఎంఓలను నియమించాలని సూచించారు. వైద్యులు విధిసమయాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, ఆర్‌ఎంఓ డాక్టర్ సంతోష్, వైద్యులు యుగంధర్, దేవరాజ్, నిఖిత తదితరులు పాల్గొన్నారు.
ప్రయాణికుల రద్దీకి
అనుగుణంగా బస్సులు
ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సరిరామ్
భద్రాచలంఅర్బన్: ప్రయాణికులు ఇబ్బంది పడకుండా రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు నడిపిస్తూ ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సరి రామ్ సూచించారు. భద్రాచలం ఆర్టీసీ డిపో, బస్టాండ్‌ను బుధవారం తనిఖీ చేసిన ఆయన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం రీజియన్ పరిధిలోని ఏడు డిపోల మేనేజర్లతో సమావేశమైన ఆర్‌ఎం మాట్లాడు తూ భద్రాచలంలో రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ప్రత్యేకంగా పరీక్షించాక అనుమతించాలని సూ చించారు. కార్యక్రమంలో సీఐలు విజయ శ్రీ, శ్రీనివాస్, ఎంఎఫ్‌లుచక్రవర్తి, శ్రీనివాస్, భద్రా చలం డిపో మేనేజర్ జంగయ్య పాల్గొన్నారు.


