అశ్వాపురం: మండల పరిధిలోని మిట్టగూడెం గ్రామ శివారులో రథం గుట్ట వద్ద ఉన్న వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లో క్లోరిన్ గ్లాస్ లీకేజీని బుధవారం అరికట్టారు. మిషన్ భగీరథ గ్రిడ్, క్వాలిటీ కంట్రోల్ రెవెన్యూ అధికారులు ప్లాంటును సందర్శించి పరిశీలించారు. మణుగూరు భారజల కర్మాగారం, ఐటీసీ నుంచి సీనియర్ టెక్నీషియన్లను రప్పించి క్లోరిన్ గ్యాస్ లీకై న సిలిండర్ను పరిశీలించారు. ఆ సిలిండర్లో క్లోరిన్ గ్యాస్ పూర్తిగా అయిపోయిందని ఎటువంటి ప్రమాదం లేదని వారు నిర్ధారించారు. భవిష్యత్తులో గ్యాస్ లీకై తే తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈఈ నళిని, డీఈలు సలీం, సత్యసాయి, ఏఈలు నితిన్, చైతన్య, రాకేష్, తహసీల్దార్ సూర్యప్రకాష్, ఆర్ఐ లీలావతి తదితరులు పాల్గొన్నారు.


