సూపర్‌బజార్(కొత్తగూడెం): జపాన్‌లో ఏడు రోజు ల అధ్యయన పర్యటనలో పరిశీలించిన ఉత్తమ విధానాలను జిల్లాలో అమలుచేస్తామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ జపాన్ పర్యటన విశేషాలను వివరించారు. నీతి ఆయోగ్ గుర్తించిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్‌గా జిల్లా, ఆస్పిరేషనల్ బ్లాక్‌గా గుండాల మండలం అభివృద్ధికి ప్రత్యే క ప్రాధాన్యత లభిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో అధ్యయన పర్యటనకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 20 మంది ప్రతినిధులు పాల్గొన్నారని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబు దాడుల అనంతరం తీవ్రంగా దెబ్బతిన్న జపాన్ దేశం విద్య, సాంకేతికత, క్రమశిక్షణ, దీర్ఘకాలిక విధాన నిర్ణయాలు, కఠిన శ్రమతో అభివృద్ధి సాధించిన తీరును అధ్యయనం చేసినట్లు వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై అధ్యయనం చేశామన్నారు. జపాన్‌లో ప్రభుత్వ రంగమే అధికశాతం పనిచేస్తోందని, జిల్లాలో అటవీ ప్రాంతాలు, రహదారి అనుసంధానం, నెట్‌వర్క్ సమస్యలు వంటి సవాళ్లు ఉన్నా అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును జపాన్ బృందం అభినందించిందని వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. టీఆర్‌ఈఎస్‌ఏ రాష్ట్ర సెక్రటరీ కృష్ణ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.పుల్లయ్య, నాయకులు రామకృష్ణ, దారా ప్రసాద్ , శంకర్ , రంగా ప్రసాద్ , అంజాద్ పాషా , ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు: విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. మండల పరిధిలోని వేపలగడ్డ గిరిజన సంక్షేమ మోడల్ పాఠశాలను బుధవా రం తనిఖీ చేశారు.విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
కలెక్టర్ అంకిత్


