టెండర్లు.. రిపీట్‌! | - | Sakshi
Sakshi News home page

టెండర్లు.. రిపీట్‌!

Nov 20 2026 12:43 AM | Updated on Nov 20 2026 12:43 AM

పాతవారికే టెండర్లు?

కొత్తగూడెం కార్పొరేషన్‌లో టెండర్ల తంతు

ఆదాయానికి గండిపడుతున్నా మారని తీరు

ఆరు నెలల తర్వాత చికెన్‌ వ్యర్థాల సేకరణ అనుమతి పొడిగింపు

పలు అంశాల్లో

అధికారుల తీరుపై విమర ్శలు

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఆదాయాన్ని పెంచే మార్గాలు అన్వేషించడంలో పాలకవర్గం, అధికారులు విఫలమవుతున్నారు. కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయాన్ని ఎలా గండికొట్టాలనే ఆలోచనలతో ముందుకెళ్తున్నట్లు వీరి తీరు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రతీ టెండర్‌ను రెండేసి సార్లు పిలవడం పరిపాటిగా మారింది. అభివృద్ధి కంటే అవినీతి నిధులు ఎక్కడ నుంచి ఏ విధంగా వస్తాయనే వాటిపై దృష్టి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమాన అడ్డగోలు అనుమతులు, ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సమాచారం.

ప్రతీది రెండేసి సార్లు..

గతంలో వారపుసంత, డైలీ మార్కెట్‌, కార్పొరేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, విదేశీ బ్యాంకు రుణా నిధులకు సంబంధించి డీపీఆర్‌ టెండర్‌ ఇలా అన్నీ రెండుసార్లు టెండర్లు పిలిచిన దాఖలాలున్నాయి. కొత్తగూడెం తప్పితే పాల్వంచ, సుజాతనగర్‌ డివిజన్లలో ఎక్కువ మంది కార్పొరేటర్లు మొదటి సారే గెలిచారు. అయినా అటు పాలకవర్గానికి, ఇటు అధికారులకు అభివృద్ధి దిశానిర్ధేశం లేకుండా ముందుకు సాగడం కష్టతరమవుతుంది. చికెన్‌, చేపల వ్యర్థాల సేకరణకు సంబంధించిన టెండర్‌ విషయంలో ఇదే జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఆరు నెలల తర్వాత..

కొత్తగూడెంలో చికెన్‌, చేపల వ్యర్థాల సేకరణకు సంబంధించి గత పాలకవర్గం నుంచి కూడా అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెంలో అప్పటి నుంచి టెండర్‌ తేది ముగిసినా చికెన్‌, చేపల వ్యర్థాల సేకరణ శానిటేషన్‌ విభాగం అధికారుల కనుసన్నల్లో యథేచ్ఛగా జరిగింది. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ ఏడాది గత ఆరు నెలల క్రితమే చికెన్‌, చేపల వ్యర్థాల సేకరణ టెండర్‌ గడువు ముగిసింది. అయినా అధికారులు, పాలకవర్గ పెద్దల అనధికారిక అనుమతితో సంబంధిత కాంట్రాక్టర్‌ వ్యర్థాలను తరలిస్తుండడంతో పలువురు అధికారులపై ఒత్తిడి చేయడంతో ఆరు నెలల క్రితమే టెండర్‌ ముగిసింది. మళ్లీవచ్చే ఏడాది మార్చి వరకు కూడా వ్యర్థాలను సేకరించడానికి అనుమతి ఇవ్వాలని, అందుకు సంబంధించిన అంశాన్ని ఆమోదించాలని గత వారం జరిగిన పాలకవర్గ సమావేశంలో అజెండాలో చివరి అంశంగా పాలకవర్గ సభ్యులతో ఆమోదింపజేశారు. ఇదే అమలైతే మున్సిపాలిటీకి రూ.లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.

కొత్తగూడెం కార్పొరేషన్‌ కాక ముందు నిర్వహించిన టెండర్‌ దక్కించుకున్న వారికే ప్రస్తుతం కూడా కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనరగ్‌కు సంబంధించి ఒక్కరికే టెండర్‌ ఇవ్వడం వలన కార్పొరేషన్‌కు ఆదాయంతో పాటు టెండర్‌ దారులకు లాభం చేకూరే అవకాశం ఉంటుంది. పాలకవర్గ ఆమోదంతో వ్యర్థాల సేకరణకు అనుమతి ఇవ్వడం సరైన పద్ధతి కాదని, టెండర్‌ల ద్వారా అనుమతులు ఇవ్వాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement