పాల్వంచరూరల్: ప్రతీరోజు ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు సేవలు అందించాల్సి న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది గురువారం మధ్యాహ్నమే సబ్ సెంటర్లకు తాళాలు వేశారు. ఓ ఆశా కార్యకర్త కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు వారు సేవలకు సెలవిచ్చారు. పాల్వంచ మండలం ఉల్వనూరు పీహెచ్‌సీ పరిధి యానంబైల్, కిన్నెరసాని, పాండురంగాపురం సబ్ సెంటర్లలో విధులు నిర్వర్తించే సిబ్బంది గురువారం మధ్యాహ్నమే సెంటర్లను మూసివేశారు. ఈ పీహెచ్‌సీ పరిధిలోని ఓ ఆశా కార్యకర్త కుమారుడి వివాహం పెద్దమ్మతల్లి గుడి వద్ద జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు సిబ్బంది తాళాలు వేసి వెళ్లిపోగా, చికిత్స కోసం వచ్చిన ప్రజలు నిరాశగా వెనుదిరిగారు. కాగా, ఉల్వనూరు పీహెచ్‌సీ డాక్టర్ దేవేందర్ ఉన్నప్పటికీ సమాధానం చెప్పలేదని తెలిసింది. ఈ విషయమై డాక్టర్ దేవేందర్ వివరణ కోరగా.. సబ్‌సెంటర్లు మూసివేసిన విషయం తనకు తెలియదని చెప్పారు. ఒక ఉద్యోగి అయినా ఉండాలని, ఏం జరిగిందో తెలుసుకుంటానని వెల్లడించారు.
ఆశా కార్యకర్త కుమారుడి
పెళ్లికి వెళ్లిన సిబ్బంది


