జీజీహెచ్‌కు మహర్దశ | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌కు మహర్దశ

Nov 20 2026 12:43 AM | Updated on Nov 20 2026 12:43 AM

ఖమ్మం పెద్దాస్పత్రికి

రూ.5 కోట్లతో వైద్య పరికరాలు

పూర్తయిన టెండర్లు, త్వరలోనే సరఫరా

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి మహర్దశ పడుతోంది. మునుపెన్నడూ లేనట్టు భారీగా కేటాయిస్తున్న నిధులను పరికరాల కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. దీంతో వైద్యసేవలు మరింత మెరుగయ్యే అవకాశం ఏర్పడనుంది. ఓ పక్క మౌలిక వసతుల కోసం నిర్మాణాలు చేపడుతుండగా, వైద్య పరికరాల కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయి. ఈ పరికరాలు చేరితే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.

ఆరోగ్యశ్రీ నిధులతో..

పెద్దాస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో నిర్వహించిన చికిత్సల బకాయిలు పేరుకుపోయాయి. ఇప్పటివరకు సుమారు రూ. 12 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా, ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని పలు ఆస్పత్రులకు బకాయిలు విడుదల చేసింది. అంతేకాక ఈ నిధులను ఆస్పత్రుల్లో ఇతర అవసరాలకు కాకుండా వైద్య పరికరాల కొనుగోలుకే వెచ్చించాలని ఆదేశించింది. ఈమేరకు ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.5.96 కోట్లు విడుదల కావడంతో రూ.47 లక్షలు మాత్రం అత్యవసరంగా కార్డియాలజీ, ఆర్థో విభాగాల్లో స్టంట్లు, ఇంప్లాంట్లు కొనుగోలు చేసిన బిల్లులు చెల్లించారు.

రూ. 5.49 కోట్లతో వైద్య పరికరాలు

ఆరోగ్యశ్రీ నిధులతో వివిధ విభాగాల్లో అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈక్రమాన కలెక్టర్‌ దివాకర, అదనపు కలెక్టర్‌ శ్రీజ అన్ని విభాగాల హెచ్‌ఓడీలతో సమావేశమై ఏమేం పరికరాలు కావాలో చర్చించారు. ఆర్థోపెడిక్‌, జనరల్‌ సర్జరీ, కార్డియాలజీ, ఈఎన్‌టీ, పీడియాట్రిక్‌, గైనిక్‌, పల్మనాలజీ, డెంటల్‌, అనస్తీషియా విభాగాల్లో అవసరమైన వైద్య పరికరాల జాబితా రూపొందించి టెండర్లు ఆహ్వానించారు. ఈక్రమాన తక్కువ కోట్‌ చేసిన మూడు కంపెనీలను ఎంపిక చేయడంతో త్వరలోనే పరికరాలు సమకూర్చనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement