చదువుతోనే ఉన్నత స్థాయికి... | - | Sakshi
Sakshi News home page

చదువుతోనే ఉన్నత స్థాయికి...

Nov 20 2026 12:43 AM | Updated on Nov 20 2026 12:43 AM

భద్రాచలం: విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకుని, కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ తెలిపారు. శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆధ్వర్యాన నిర్వహించిన ‘చదువుకో తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా గత ఏడాది పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఈ ప్రోత్సాహకాలను భద్రాచలంలో గురువారం అందజేసిన పీఓ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్‌లో కూడా ఇదే ఒరవడి కొనసాగించాలని సూచించారు. అశ్వారావుపేటకు చెందిన కందుకూరి పూజిత, పినపాకకు చెందిన గొంజి జేష్మ రమణిక, కొత్తగూడెంకు చెందిన చాణకుల లక్ష్మీ రమణికి రూ.లక్ష చొప్పున, 23 మండలాల టాపర్లకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులు అందుకున్నారు. ఆతర్వాత వచ్చే ఏడాది విద్యార్థులకు అందించే ప్రోత్సాహకాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీ చందన, జేడీఎం హరికృష్ణ, శ్రీరామ్‌ లైఫ్‌ ప్రతినిధులు సతీష్‌, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement