చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Nov 20 2026 12:43 AM | Updated on Nov 20 2026 12:43 AM

ములకలపల్లి: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.రాజేందర్‌ సూచించారు. ములకలపల్లి రైతువేదికలో గురువారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండడంతో పంటల సాగులో రైతులు జాగ్రత్త వహించాలని, నష్టపోతే అండగా నిలిచే విత్తన చట్టంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అన్నదాతలు వారి సమస్యల పరిష్కారానికి సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందొచ్చని పేర్కొన్నారు. అలాగే, బాల్య వివాహాల నివారణకు అందరూ పాటుపడాలని తెలిపారు. అలాగే, చిన్నారులపై లైంగిక వేధింపుల కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోక్సో చట్టంపై వివరించారు. ఎంపీడీఓ సత్యనారాయణ, సీడీపీఓ అలేఖ్య, ఏఓ అరుణ్‌బాబు, సర్పంచ్‌లు చంద్రలేఖ, సుజాత, ఆదిలక్ష్మి, పారాలీగల్‌ వలంటీర్లు వీరభద్రం, భిక్షమయ్య, జానకీరాం తదితరులు పాల్గొన్నారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

రాజేందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement