పెద్దమ్మతల్లికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి విశేష పూజలు

Nov 16 2026 12:08 AM | Updated on Nov 16 2026 12:08 AM

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్‌ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజాది కార్యక్రమాల్లో వేద పండితులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ, ప్రసాద్‌ శర్మ పాల్గొన్నారు.

నేడు ప్రజావాణి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభమవుతుందని, ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను అందజేయాలని సూచించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ప్రజావాణి నిర్వహిస్తామని, జిల్లాలోని అన్ని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో ప్రజావాణి ఉంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

గిరిజన దర్బార్‌కు

అధికారులు హాజరుకావాలి

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్‌, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రజావాణి కార్యక్రమాలకు అన్ని శాఖల అధికారులు ఉదయం 10.30 గంటలకు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌, సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక ఫిర్యాదులు అందజేయాలని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు.

ప్రధాని సందేశాన్ని

వీక్షించిన గిరిజన విద్యార్థులు

భద్రాచలంటౌన్‌: బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశాన్ని ఆదివారం ఐటీడీఏ ప్రాంగణంలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో గిరిజన విద్యార్థులు వీక్షించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ మాట్లాడుతూ గిరిజన హక్కుల కోసం బిర్సా ముండా చేసిన పోరాటం, త్యాగాలు, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పాత్రను విద్యార్థులు తెలుసుకున్నారని తెలిపారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఐటీడీఏ సిబ్బంది కళ్యాణ్‌, రాజేష్‌, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్ట్‌ కార్మికుల నిరసన

నిలిచిపోయిన 48 వేల

టన్నుల బొగ్గు ఉత్పత్తి

రుద్రంపూర్‌: సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని వీకేసీఎంలో మట్టితీసే కాంట్రాక్ట్‌ కార్మికులు ఆరో రోజులుగా నిరసన తెలుపుతున్నారు. దీంతో 48 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తితోపాటు, దాదాపు 3 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీ స్తంభించింది. సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎం స్పందించి సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. వీకేసీ ఎంలోని శోధా కంపెనీ కార్మికులకు బోనస్‌ చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీజియన్‌లోని అన్ని ఓబీ కంపెనీలు బోనస్‌ చె ల్లిస్తున్నా.. వీకేసీఎంలో మాత్రం అమలు కావడం లేదని కాంట్రాక్ట్‌ జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎల్‌నినో నేపథ్యంలో విద్యుత్‌ సంస్థలకు అవసరమైన బొగ్గు సరఫరా చేసేందుకు ఉత్పత్తి పెంచాలని యాజమాన్యం ఆదేశిస్తున్నా తరుణంలో సమస్యలు పరిష్కరించి కార్మికుల నిరసన విరమింపజేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement