వేసవికి ముందే నీటి నిల్వలు.. | - | Sakshi
Sakshi News home page

వేసవికి ముందే నీటి నిల్వలు..

Nov 16 2026 12:08 AM | Updated on Nov 16 2026 12:08 AM

అశ్వాపురం: రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన ఇసుక బస్తాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మండలంలోని కుమ్మరిగూడెం వద్ద ఆనకట్ట పనులను భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్‌ విద్యాచందన, ఇరిగేషన్‌ అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో గోదావరిలో నీటి ప్రవాహం పడిపోయిందని తెలిపారు. దుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాలతో 1.2 మీటర్లకు పైగా నీటిమట్టాన్ని నిల్వ చేసి, మూడు నుంచి నాలుగు నెలల పాటు తాగునీటి అవసరాలు తీర్చవచ్చని పేర్కొన్నారు. ఇరిగేషన్‌ ఎస్‌ఈ మహేశ్వరరావు, ఈఈ రాంబాబు, సర్పంచ్‌ కవిత తదితరులు పాల్గొన్నారు.

కొండరెడ్ల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి

దమ్మపేట: కొండరెడ్లు, గొత్తికోయల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని, పూసుకుంట గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని మంత్రి తుమ్మల సూచించారు. పూసుకుంట గ్రామంలోని కొండరెడ్లతో మంత్రి సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజనుల జీవన స్థితిగతులపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనులకు స్థిరమైన ఆదాయం లభించేలా ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలను కల్పించాలని సూచించారు. బడి వయసు ఉన్న ప్రతీ చిన్నారి పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని, కటుకూరులో వాటర్‌ ట్యాంక్‌ మరమ్మతులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్‌ మంజూరు పత్రాలు, విద్యార్థులకు ఏకరూప దుస్తులతోపాటు కిట్లను పంపిణీ చేశారు. ఆ తర్వాత మంత్రికి గిరిజనులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, డీఆర్‌డీఓ పీడీ విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఎఫ్‌డీఓ కృష్ణమాచారి, డీఏఓ బాబూరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ సవేరం, ఐటీడీఏ ఏఓ గన్యా, ఏపీఓ జనరల్‌ డేవిడ్‌ రాజు, ఏంపీడీఓ రవీంద్రా రెడ్డి, సర్పంచ్‌ రాజిరెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

తుమ్మల నాగేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement