కనుల పండువగా రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా రామయ్య కల్యాణం

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి రామసేవా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం

శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి పలువురు భక్తులు గురువారం విరాళాలను అందజేశారు. విజయవాడకు చెందిన అలార తిరుమల గోదావర్తి గోపాలకృష్ణమాచార్యులు – వనజ దంపతులు రూ.లక్ష అందించారు. కోదాడకు చెందిన కందిబండ ఉపేందర్‌రావు – కృష్ణవేణి రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

పెద్దమ్మతల్లికి

సువర్ణ పుష్పార్చన

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణపుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ విజయ్‌కుమార్‌, వేదపండితుడు పద్మనాభశర్మ పాల్గొన్నారు.

జాతీయ పోటీలకు ఎంపిక

రుద్రంపూర్‌: రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని జే.హర్షిక అథ్లెటిక్స్‌లో ప్రతిభ చూపింది. రాష్ట్రస్థాయిలో పోటీల్లో ద్వితీయస్థానం సాధించి జాతీయ పోటీలకు ఎంపికై ంది. గురువారం విద్యార్థినితోపాటు వ్యాయామ ఉపాధ్యాయురాలు ధర్మమ్మను డీఈఓ శంభూప్రసాద్‌, హెచ్‌ఎం భరత్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

నాలుగు జిల్లాల

మత్స్యకారులకు శిక్షణ

కూసుమంచి: కూసుమంచి మండలం పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో నాలుగు రోజుల మత్స్యకారులకు ఇచ్చే శిక్షణ గురువారం ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన మత్స్య రైతులు, మత్స్యకారులు పాల్గొనగా ఏపీలోని మత్స్య కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆనంద్‌ప్రసాద్‌ మాట్లాడారు. రోజురోజుకు మంచినీటి చేపలకు డిమాండ్‌ పెరుగుతోందని, రాష్ట్రంలో మంచినీటి వనరులు అందుబాటులో ఉన్నందున మత్స్యకారులు చేపల పెంపకంలో శాసీ్త్రయ పద్ధతులు, యాజమాన్య విధానాలు పాటించాలని సూచించారు. అనంతరం సమీకత పద్ధతిలో చేపలతో పాటు కోళ్లు, మేకలు, బాతులు, ఆవుల పెంపకంపై అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement