పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో వార్షిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో వార్షిక తనిఖీ

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): హేమచంద్రాపురంలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఎస్పీ రోహిత్‌ రాజు గురువారం వార్షిక తనిఖీ నిర్వహించారు. తొలుత ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అధికారులు, సిబ్బంది ప్రభుత్వ కిట్‌ ఆర్టికల్స్‌ను పరిశీలించారు. ఆ తర్వాత అడ్మిన్‌ ఆర్‌ఐ, మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌, వెల్ఫేర్‌, హోంగార్డ్స్‌ కార్యాలయాలను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. బాంబు డిస్పోజల్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాల పనితీరును పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని చెప్పారు. ఏఆర్‌ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐలు సుధాకర్‌, నరసింహారావు, లాల్‌ బాబు, కృష్ణారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement