పాల్వంచ: పాల్వంచలోని శ్రీనివాసకాలనీలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం (శ్రీనివాసగిరి) అభివృద్ధికి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి చొరవ తీసుకున్నారు. ఇక్కడ ప్రకృతి పర్యాటక అభివృద్ధి కోసం ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.50 లక్షలు కేటాయించారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.25 లక్షల చొప్పున రెండు వేర్వేరు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తూ కలెక్టర్కు ప్రతిపాదనలు అందజేశారు.
రెండు కిలోమీటర్ల మేర నడకదారులు
నిధులతో శ్రీనివాసగిరి ఈస్ట్ బీట్ ప్రాంతంలో రెండు కిలోమీటర్ల మేర ఫుట్పాత్లు, పాదచారుల నడకదారులను నిర్మించనున్నారు. ప్రకృతి రమణీయతకు ఆధ్యాత్మికతను జోడిస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వీటిని రూపొందించారు. కాగా, శ్రీనివాసగిరిని ఎకో టూరిజం కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తామని ఎంపీ రఘురాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, నిధుల మంజూరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీ రఘురాంరెడ్డితో చొరవతో
నిధులు మంజూరు


