అశ్వారావుపేట అడవుల్లోకి పులి | - | Sakshi
Sakshi News home page

అశ్వారావుపేట అడవుల్లోకి పులి

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

అశ్వారావుపేటరూరల్‌: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మూడు రోజులుగా సంచరిస్తూ కలకలం రేపుతున్న పులి గురువారం ఏపీ సరిహద్దు దాటి అశ్వారావుపేట మండల అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. గతంలో అమర్చిన ట్రాకర్‌ సిగ్నల్‌ ద్వారా ప్రస్తుతం మండలంలోని గుమ్మడవల్లి ఫారెస్టు బీట్‌ పరిధిలోని బచ్చువారిగూడెం, చెన్నాపురం మీదుగా కావడిగుండ్ల అటవీప్రాంతంలోకి చేరినట్లు చెబుతున్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా అటవీ శాఖ అధికారుల సమాచారంతో స్థానిక అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పులి సంచారం నేపథ్యంలో పశువులను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లవద్దని, ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని సూచించారు. కాగా, పులి తెలంగాణ అటవీ ప్రాంతంలోకి వచ్చినట్లు ఏపీ అధికారులు సమాచారం ఇచ్చారని ఫారెస్టు రేంజర్‌ మురళీకృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement