రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఏవీ? | - | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఏవీ?

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

గతేడాది జూలైలో ఉద్యోగ విరమణ ప్రయోజనాలు పెంపు

ఏడాది గడిచినా అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం

ఎదురుచూస్తున్న79 మంది రిటైర్డ్‌ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు

రిటైర్మెంట్‌ నగదు ఇవ్వాలి

అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా

అశ్వాపురం: అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ సమయంలో అందించే ఆర్థిక ప్రయోజనాలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుకు నోచుకోవడంలేదు. గతంలో ఉద్యోగ విరమణ పొందిన అంగన్‌వాడీ టీచర్‌కు రూ.లక్ష, ఆయాకు రూ.50 వేల చొప్పున రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ అందించేవారు. 2025 జూలై నుంచి ఈ మొత్తాన్ని పెంచుతూ నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీచర్‌కు రూ.2 లక్షలు, ఆయాకు రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఏడాది గడిచినా పెరిగిన మొత్తాలు అందకపోవడంపై సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిబ్బందికి ఆర్థిక ఇబ్బందులు

జిల్లాలో 11 మంది అంగన్‌వాడీ టీచర్లు, 68 మంది ఆయాలు.. మొత్తం 79 మంది 2025 జూలై నుంచి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్లపాటు సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన వారు ప్రస్తుతం అనారోగ్య సమస్యలు, కుటుంబ అవసరాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన పెరిగిన రిటైర్మెంట్‌ ప్రయోజనాలు అందకపోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రిటైర్మెంట్‌ తక్షణమే చెల్లించాలని కోరుతున్నారు.

అంగన్‌వాడీ ఆయాగా పనిచే 2025 జూలైలో ఉద్యోగ విరమణ పొందాను. ఏడాది దాఇనా ఇప్పటివరకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వలేదు. గతంలో ఆయాలకు రూ.50 వేలు అయినా వెంటనే వచ్చేవి. ప్రభుత్వం రూ.లక్షకు పెంచిందని సంతోషించాం. కానీ అమలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. – ఎస్‌కే.ఖాజాభీ, సత్యానారాయణపురం,

అశ్వాపురం మండలం

అంగన్‌వాడీ ఆయాగా ఎన్నో ఏళ్లపాటు సేవలు అందించా. రిటైర్‌ అయ్యాక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా. వైద్యానికి కూడా డబ్బులు లేవు. మా సేవలను గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించి రిటైర్‌మెంట్‌ డబ్బులు ఇవ్వాలి.

– ఈసం లక్ష్మి, ఎలకలగూడెం,

అశ్వాపురం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement