గో విజ్ఞాన పరీక్షలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

గో విజ్ఞాన పరీక్షలకు ఎంపిక

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం మేదరబస్తీ శ్రీ రాగా ప్లే, హైస్కూల్‌ విద్యార్థులు ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన గో విజ్ఞాన పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ప్రతిభ కనబరిచిన టి.గణవి, ఎం.హర్షిణిలను పాఠశాల కరస్పాండెంట్‌ మల్లారపు వరప్రసాద్‌, డైరెక్టర్‌ మల్లారపు కవిత, ఉపాధ్యాయులు గురువారం అభినందించారు. ఈవెంట్‌ ట్రైనర్‌ మహాలక్ష్మి, గైడ్‌ టీచర్‌ చరితశ్రీ, ఉపాధ్యాయులు రాంబాబు, శోభా రాణి, రామకృష్ణ, భాస్కర్‌, కీర్తి, అఖిల్‌, వెంకటదీప్తి, వెంకటలక్ష్మి, రమ్య, స్వాతి, నాగమణి, ఆఫ్రీన్‌ తదితరులు పాల్గొన్నారు.

108 సేవలు

అందుబాటులో ఉండాలి

చుంచుపల్లి: జిల్లాలో 102, 104, 108 సేవలను ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ సూచించారు. గురువారం ఆయా సేవల నిర్వాహకులతో తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 102 వాహనాలు 19, 108 వాహనాలు 28 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రసవ కేసులను ఆలస్యం చేయకుండా 24 గంటల ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. సమావేశంలో 102, 108 ప్రోగ్రాం అధికారి ఎస్‌కే నజీరుద్దీన్‌, ఈఎంఈలు సతీష్‌, మనోహర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నాగలక్ష్మి పాల్గొన్నారు.

జెడ్పీలో నలుగురు

ఉద్యోగులకు పదోన్నతులు

చుంచుపల్లి: జిల్లా పరిషత్‌ పరిధిలో ముగ్గురు రికార్డు అసిస్టెంట్లకు జూనియర్‌ అసిస్టెంట్లుగా, ఆఫీస్‌ సబార్డినేట్‌కు టైపిస్టుగా పదోన్నతులు కల్పిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం జెడ్పీ కార్యాలయంలో సీఈఓ బి. నాగలక్ష్మి, డిప్యూటీ సీఈఓ బి.అప్పారావు, పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లవరపు రాజేష్‌ పదోన్నతి ఉత్తర్వులను ఉద్యోగులకు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు, సూపరింటెండెంట్‌ పాల్గొన్నారు.

ఉత్తమ ప్రిన్సిపాల్‌గా సీతామహాలక్ష్మి

● సీఎం చేతుల మీదుగా పురస్కారం

ఖమ్మంఅర్బన్‌: మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల విభాగంలో ఖమ్మం బాలికల గురుకులం–2 ప్రిన్సిపాల్‌ పొలిమెట్ల సీతామహాలక్ష్మి రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపాల్‌గా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆమెకు సీఎం రేవంత్‌రెడ్డి పురస్కారం అందజేశారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించడమే కాక విద్యా ప్రమాణాల పెంపు, క్రమశిక్షణ, సంక్షేమం, అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.

రెండు

ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

చింతకాని: మండలంలోని చిన్నమండవలో మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు గురువారం సీజ్‌ చేశారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఇసుక తరలింపునకు అనుమతి లేదని తేలడంతో వాహనాలను సీజ్‌ చేసి, బాధ్యులపై కేసు నమోదు చేశామని ఎస్సై నరేష్‌ తెలిపారు.

బీమా ప్రీమియం

చెల్లింపులకు విరామం

ఖమ్మంగాంధీచౌక్‌: తపాలాశాఖలో పీఎల్‌ఐ, ఆర్పీ ఎల్‌ఐ సేవలను ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్‌ నుంచి కొత్త సాఫ్ట్‌వేర్‌కు మారుస్తున్నారు. ఈమేరకు పాలసీదారులు ప్రీమియం నగదును ఈనెల 15వ తేదీ లోపు చెల్లించాలని అధికారులు కోరారు. ఈనెల 16నుంచి 24వ తేదీ వరకు ప్రీమియం చెల్లింపులకు అవకాశం ఉండదని, తిరిగి 25వ తేదీ నుంచి కొత్త సాఫ్ట్‌వేర్‌ ద్వారా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement