వైరారూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్ సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగితే విజయాలు సొంతమవుతాయని తెలిపారు. వైరా మండలం రెబ్బవరంలోని ముసలిముడుగు మహా త్మా జ్యోతిబాపూలే పాఠశాలలో అండర్–17 విభాగం బాలికల క్రీడాపోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 12 గురుకులాలకు చెందిన 420 మంది విద్యార్థినులు పాల్గొనగా పోటీలను ఎమ్మెల్యే రాందాస్ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక వికాసం పెరుగుతుందని తెలిపారు. విద్యార్థినులకు కబడ్డీ, ఖో–ఖో, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనుండగా గురుకులాల ఆర్‌సీఓ రాంబాబు, ఎంఈఓ చావా శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ రాధిక, సర్పంచ్ వేల్పుల జ్యోతి, మార్కెట్ చైర్మన్ బోళ్ల గంగారావు, వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, నాయకులు బొర్రా రాజశేఖర్, దాసరి దానియేలు, రాంపూడి రోశయ్య, కట్ల రంగారావు, డాక్టర్ కాపా మురళీకృష్ణ, వీరంశెట్టి సీతరాములు, పమ్మి అశోక్, దొడ్డా పుల్లయ్య, కోసూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్


