సింగరేణి క్రికెట్‌ టోర్నీ షురూ.. | - | Sakshi
Sakshi News home page

సింగరేణి క్రికెట్‌ టోర్నీ షురూ..

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

రామకృష్ణాపూర్‌: సింగరేణి సంస్థ ఆధ్వర్యాన కంపెనీ స్థాయి క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్‌ స్టేడియంలో బుధవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు పోటీలు జరగనుండగా, మందమర్రి – బెల్లంపల్లి సంయుక్త జట్టు, శ్రీరాంపూర్‌ జట్టు, మణుగూరు – ఇల్లెందు సంయుక్త జట్టు, కొత్తగూడెం కార్పొరేట్‌ జట్టు, ఆర్జీ–1, 2 సంయుక్త జట్టు, ఆర్జీ 3 – భూపాలపల్లి సంయుక్త జట్లు పాల్గొంటున్నాయి. మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ బ్యాటింగ్‌ చేసి పోటీలను ప్రారంభించి మాట్లాడారు. కోలిండియా స్థాయి పోటీల్లోనూ రాణించి సింగరేణి కీర్తి ప్రతిష్టలు చాటాలని పిలుపునిచ్చారు. కాగా, ఆర్జీ 3 – భూపాలపల్లి, ఇల్లెందు – మణుగూరు సంయుక్త జట్ల మధ్య పోటీ జరగగా, ఇల్లెందు – మణుగూరు జట్టు విజయం సాధించింది. వివిధ విభాగాల అధికారులు, నాయకులు రమేశ్‌, అశోక్‌, ఖాదిర్‌, సలెంద్ర సత్యనారాయణ, కార్తీక్‌, సురేందర్‌, అశోక్‌, నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement