పాల్వంచరూరల్: నిర్ణీత కాల పరిమితిలో వందశాతం లక్ష్యాన్ని సాధించాలని, అవసరమైన డేటాను అప్డేట్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ అన్నారు. పాతఆర్డీఓ కార్యాలయంలోని డిప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వైద్యాధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఎన్సీడీ డేటా అప్డేట్ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తిచేయాలని, ఏఎన్సీ రిజిస్ట్రేషన్ బుధవారం లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. 102 సేవల వినియోగం మెరుగు పర్చాలన్నారు. ఐఎఫ్ఏ కన్జంప్షన్ అశ్వాపురం పీహెచ్సీలో కేవలం 8శాతం మాత్రమే నమోదైందని, తక్షణమే మెరుగుపర్చాలని ఆదేశించారు. అధికారులు సైదులు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యాలను పూర్తి చేయాలి
చుంచుపల్లి: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ వైద్యాధికారులను ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ, హెచ్పీవీ వ్యాక్సినేషన్, టీబీ, లెప్రసీ, కీటక జనిత వ్యాధుల నివారణ తదితర కార్యక్రమాలపై బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పీహెచ్సీల్లో వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.
డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్


