అర్హులకే చేయూత పెన్షన్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులకే చేయూత పెన్షన్లు

Nov 8 2026 12:25 AM | Updated on Nov 8 2026 12:25 AM

అన్నపురెడ్డిపల్లి: అర్హులైన వారికే చేయూత పెన్షన్లు అందేలా దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని డీఆర్‌డీఓ విద్యాచందన తెలిపారు. మండలంలోని పెద్దిరెడ్డిగూడెంలో చేయూత పెన్షన్ల కోసం అందిన దరఖాస్తుల ఆధారంగా శనివారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారి స్థితిగతులు, అర్హతలపై ఆరా తీశారు. అనంతరం డీఆర్‌డీఓ మాట్లాడుతూ అర్హులైన పేదలకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయనుందని తెలిపారు. ఏపీడీ రమణ, పంచాయతీ కార్యదర్శి నరేష్‌ పాల్గొన్నారు.

వైద్య, ఆరోగ్య శాఖలో 95 పోస్టుల భర్తీకి దరఖాస్తులు

చుంచుపల్లి: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా వివిధ కేటగిరీలకు చెందిన 95 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌ తెలిపారు. పోస్టుల వారీగా అర్హతలు, ఇతర వివరాలను జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామని తెలిపారు. ఈమేరకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 9నుంచి 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే, ల్యాబ్‌ టెక్నీషియన్‌, సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌ (ఎస్టీఎల్‌ఎస్‌) పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్‌ జాబితాను జిల్లా వెబ్‌సైట్‌తో పాటు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రదర్శించినట్లు తెలిపారు. అభ్యంతరాలు ఉంటే 10 నుంచి 12వ తేదీ వరకు కార్యాలయంలో తెలియజేయాలని డీఎంహెచ్‌ఓ సూచించారు.

పంచాయతీ కార్యదర్శి పనితీరుపై ఆగ్రహం

పాల్వంచరూరల్‌: గ్రామపంచాయతీకి సంబంధించిన రికార్డులను అప్‌డేట్‌ చేయని కార్యదర్శి బి.రమేష్‌పై జిల్లా పంచాయతీ అఽధికారి అనూష అసహనం వ్యక్తం చేశారు. మండలంలోని తోగ్గూడెంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మితో కలిసి శనివారం ఆమె పర్యటించారు. గ్రామంలో నిర్మించిన ఎస్‌హెచ్‌ఓ వీఓ భవనానికి సంబంధించి సీఎస్‌సీ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులతో పాటు రామాలయంలో ఇంకుడు గుంత నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం జీపీ కార్యాలయానికి వెళ్లిన డీపీఓ రికార్డులు తనిఖీ చేశారు. అయితే, పూర్తిస్థాయిలో వివరాలు రికార్డుల్లో లేకపోవడంతో కార్యదర్శిపై అసంతృప్తి వ్యక్తం చేసిన డీపీఓ, ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ఎంపీఓ షేక్‌ షాబ్నా, సర్పంచ్‌ శోభ, ఏపీఓ రఘుపతి, ఈసీ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఏఈఈ పరీక్ష

జూలూరుపాడు(సుజాతనగర్‌): టీజీపీఎస్సీ ఆధ్వర్యాన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల ఎంపికకు నిర్వహించిన పరీక్ష సుజాతనగర్‌ మండలం వేపలగడ్డలోని అబ్దుల్‌ కలాం కాలేజీలో శనివారం ప్రశాంతంగా ముగిసింది. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించగా, మొదటి సెషన్‌కు 90మందిలో 22మంది, రెండో సెషన్‌కు 23మంది అభ్యర్థులు గైర్హాజరయ్యా రు. కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయగా అధికారులు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement