భద్రాచలం: విపత్తులు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా అంకితభావంతో విధులు నిర్వర్తించే సిబ్బంది పనితీరు అభినందనీయమని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ పేర్కొన్నారు. విపత్తుల సమయాన సేవలందించిన ఫ్రంట్‌లైన్ సిబ్బందిని శనివారం ఆయ న తన కార్యాలయంలో సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి వరదల సమయంలోనే కాక శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి, గణేశ్, దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భాల్లో సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేశారని కొని యాడారు. గజ ఈతగాళ్లు కరుకు ప్రసాద్, కుమ్మర సత్యనారాయణ, పారిశుద్ధ్య కార్మికులు సుడాల కౌసల్య, సామంతుల పుష్ప, ఆశా కార్యకర్త గొర్రెముచ్చు రమాదేవి, అగ్నిమాపక కేంద్రం హోంగార్డు పానుగంటి రమేష్‌కు ప్రశంసాపత్రాలు అందజేయగా, వీరి స్ఫూర్తితో అందరూ విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఏఓ భగవాన్‌రెడ్డితో పాటు వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.


