కండక్టర్‌ ప్రవళికకు మంత్రి పొన్నం పరామర్శ | - | Sakshi
Sakshi News home page

కండక్టర్‌ ప్రవళికకు మంత్రి పొన్నం పరామర్శ

Oct 28 2026 12:30 AM | Updated on Oct 28 2026 12:30 AM

హుడా కాంప్లెక్స్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ప్రయాణికురాలు బస్సు నుంచి తోసేయడంతో తీవ్రంగా గాయపడిన కండక్టర్‌ ప్రవళికను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరామర్శించారు. కొత్తపేట సాయి సంజీవని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను మంగళవారం రాత్రి పరామర్శించి ఆరోగ్య వివరాలు, వైద్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రయాణికులకు ఇబ్బంది ఎదురైతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప భౌతిక దాడులకు పాల్పడటం సరికాదన్నారు.

ఖమ్మంమయూరిసెంటర్‌: కండక్టర్‌ ప్రవళికను ఆర్‌టీసీ ఖమ్మం ఆర్‌ఎం ఏ.సరిరామ్‌ మంగళవారం పరామర్శించారు. ఆస్పత్రిలో పరామర్శించిన ఆయన చికిత్స వివరాలు తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు జరగడం విచారకరమని తెలిపారు.

విద్యా ప్రమాణాలు

మరింత మెరుగుపడాలి

ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ చందన

బూర్గంపాడు: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారంచాలని భద్రాచలం ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ చందన సూచించారు. ఉప్పుసాకలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా రికార్డులు, వంటగదులు, సామగ్రిని పరిశీలించారు. ఆతర్వాత విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాలను పరీక్షించిన ఆమె బోధనపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఏటీడీఓ రాధ, హెచ్‌ఎం పిచ్చయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌

బృందం సిద్ధం

భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృనాల్‌ శ్రేష్ఠ

భద్రాచలం: తుపాన్‌ హెచ్చరికల నేపథ్యాన భద్రాచలం డివిజన్‌లోని సమస్యాత్మక మండలాల్లో సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సిద్ధంగా ఉందని సబ్‌ కలెక్టర్‌ మృనాల్‌ శ్రేష్ఠతెలిపారు. కొత్తగూడెం చాతకొండకు చెందిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యులు మంగళవారం రిపోర్ట్‌ చేశారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ సహాయక చర్యలపై సూచనలు చేశారు. కాగా, వరద, ఇతర సమస్యలు ఎదుర్కొనే ప్రజలు కంట్రోల్‌ రూమ్‌లోని 08743–232444 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

పాఠశాలల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత..

ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ నిర్దేశిత మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సబ్‌ కలెక్టర్‌ మృనాల్‌ శ్రేష్ఠ సూచించారు. భద్రాచలంలోని కేజీబీవీని తనిఖీ చేసిన ఆయన తరగతి గదులు, డార్మిటరీలు, స్టోర్‌ రూమ్‌, డైనింగ్‌ హాల్‌, మరుగుదొడ్లు, వంటశాల, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి మెనూ వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థునుల భద్రత, బోధనపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ప్రిన్సిపాల్‌, వార్డెన్‌ లీల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌

అసోసియేషన్‌ కౌన్సిల్‌ ఎన్నిక

రుద్రంపూర్‌: సింగరేణి కాలరీస్‌ డిస్ట్రిక్ట్‌ అసోసియేషన్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిటీ ఎన్నికలు కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించారు. తొలుత జీఎం పర్సనల్‌(వెల్ఫేర్‌, సీఎస్సార్‌, సెక్యూరిటీ) కె.అజయ్‌కుమార్‌ స్కౌట్స్‌ పతాకా న్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయ న ఆధ్వర్యాన ఎన్నిక నిర్వహించగా కమిటీ వివరాలు వెల్లడించారు. సింగరేణి కాలరీస్‌ డిస్ట్రిక్ట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ ప్యాట్రన్‌గా సీఎండీ డాక్టర్‌ బుద్ద ప్రకాశ్‌ జ్యోతి, వైస్‌ ప్రెసిడెంట్లుగా డైరెక్టర్లు ఎల్‌.వీ.సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, తిరుమలరావు, చీఫ్‌ కమిషనర్‌గా డైరెక్టర్‌ గౌతం పొట్రు వ్యవహరించనున్నట్లు తెలిపారు. అలాగే, డిస్ట్రిక్ట్‌ సెక్రటరీగా జీఎం కె.అజయ్‌కుమార్‌, డిస్ట్రిక్ట్‌ కమిషనర్‌ (రోవర్స్‌)గా జీఎం జీ.వీ.కిరణ్‌కుమార్‌, డిస్ట్రిక్ట్‌ కమిషనర్‌(స్కౌట్స్‌) గా జీఎం ఎస్‌సీఈఎస్‌. రాజేంద్రప్రసాద్‌, డిస్ట్రిక్ట్‌ జాయింట్‌ సెక్రటరీగా ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌.శారద, డిస్ట్రిక్ట్‌ కమిషనర్‌(అడల్ట్‌)గా డీజీఎం బి. శివకేశవరావు, ట్రెజరర్‌గా జీఎం సీహెచ్‌.మురళీధర్‌ వ్యవహరిస్తారని వెల్ల డించారు. ఇక అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ కమిషనర్‌(కార్పొరేట్‌) సీనియర్‌ పీఓ మండల శ్రీనివాస్‌ నియమితులయ్యారని తెలిపారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు అజయ్‌కుమార్‌, కిరణ్‌కుమార్‌, రాజేంద్రప్రసాద్‌, శివకేశవరా వు, అనిల్‌కుమార్‌, కె.సునిల్‌ కుమార్‌, శివకుమార్‌, మండల శ్రీనివాస్‌, వరప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement