సీసీలకు చిక్కకుండా రూ.2.80లక్షల చోరీ | - | Sakshi
Sakshi News home page

సీసీలకు చిక్కకుండా రూ.2.80లక్షల చోరీ

Oct 26 2026 12:10 AM | Updated on Oct 26 2026 12:10 AM

అశ్వాపురం: మండల పరిధి లోని జగ్గారం క్రాస్‌రోడ్డులోని ఆంజనేయ ఫర్టిలైజర్స్‌ పెస్టిసైడ్స్‌ దుకాణంలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఆ రోజు రాత్రి షాపు తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు షాపులో ఉన్న రూ.2.80లక్షల నగదు చోరీ చేశారు. ఆదివారం ఉదయం గుమస్తా షాపు తెరిచేందుకు రాగా తాళాలు పగలగొట్టి ఉండటం గమనించి యజమానికి, పోలీసులకు సమాచారం అందించారు. షాపులో రూ. 2.80లక్షలు దొంగిలించినట్టు యజమాని తెలపగా.. సీఐ ఎల్లయ్య, పోలీస్‌ సిబ్బంది షాపును సందర్శించి చోరీపై విచారణ చేపట్టారు. దీంతో చోరీకి ముందు దొంగలు సీసీకెమెరాల కనెక్షన్లు కట్‌ చేసి పక్కా ప్రణాళికతో చోరీ జరిగిందని భావించి క్లూస్‌ టీం షాపులో వేలిముద్రలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పెద్దమ్మగుడి వద్ద గుర్తుతెలియని

వృద్ధుడి మృతి

పాల్వంచరూరల్‌: మండల పరిధిలోని పెద్దమ్మగుడి ప్రాంగణంలో 60 – 70 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. ఈక్రమాన ఆలయ సిబ్బంది మేకల నర్సింహారావు ఆదివారం గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ ఎండ తీవ్రత(డీహైడ్రేషన్‌)కు గురై లేదా సరైనా ఆహారం అందక అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. మృతుడు నీలం రంగు ఫుల్‌ హ్యండ్‌ షర్టు, ఆకుపచ్చ నీలం రంగు లుంగీ ధరించి 5.7 అడుగుల ఎత్తు చామనచాయ రంగు కలిగి ఉన్నాడని, మృతదేహాన్ని పాల్వంచ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మార్చరీలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడి సమాచారం తెలిసిన వారు 87126 82053,87126 82054 నంబర్లలో సంప్రదించాలని ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు.

నవభారత్‌ రిటైర్డ్‌ ఉద్యోగి ఆత్మహత్య

ఖమ్మంక్రైం: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రిటైర్డ్‌ ఉద్యోగి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన లోలగాని సత్యసాయి(62) నవభారత్‌లో ఉద్యోగం చేసి రిటైర్డ్‌ అయ్యా రు. ఆయనకు బ్రెయిన్‌స్ట్రోక్‌ రావడంతో మానసిక వ్యాధితో బాధపడుతున్నా డు. ఇటీవల ఖమ్మం శ్రీనివాసనగర్‌లోని బంధువుల ఇంటికి సత్యసాయి తన భార్య మణితో కలిసి వచ్చాడు. ఆయన శనివారం రాత్రి మెట్ల పక్కన రెయిలింగ్‌కు ఉరి వేసుకున్నాడు. కాసేపటికి గమనించిన బంధువులు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్‌ సీఐ చిట్టిబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement