12 ఎకరాల్లో చెరుకు తోట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

12 ఎకరాల్లో చెరుకు తోట దగ్ధం

Oct 26 2026 12:10 AM | Updated on Oct 26 2026 12:10 AM

జూలూరుపాడు: మండలంలోని సురారం గ్రామానికి చెందిన రైతులు కొర్రా రమేష్‌, కొర్రా కీర్యా అన్నదమ్ములకు చెందిన 12 ఎకరాల చెరుకు తోట దగ్ధమైంది. బాధిత రైతుల కథనం ప్రకారం.. సురారంకు చెందిన రమేష్‌, కీర్యాలు గత 10 నెలల క్రితం 12 ఎకరాల్లో చెరుకు తోట సాగు చేశారు. మరో 20రోజుల్లో పంట చేతికొస్తుందనగా.. చెరుకు తోటకు నిప్పంటుకుని కాలిబూడిదైందని రైతులు వాపోయారు. పక్క పొలానికి చెందిన ఓ రైతు చెరుకు చేనులో మంటలు వస్తున్నాయని రమేష్‌, కీర్యాలకు కబురు చేయడంతో ఆ ఇద్దరు హుటాహుటిన పంట పొలానికి వెళ్లేసరికి కళ్లముందే కాలిపోతుండడంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఫైర్‌ ఇంజన్‌కు తెలియజేశారు. దీంతో ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకునే లోపే చెరుకు పంట అగ్నికి ఆహుతైంది.ఆతర్వాత మంటలను ఆర్పివేయగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఎకరానికి రూ.50వేల చొప్పున పెట్టుబడి..

చెరుకు సాగు కోసం ఎకరానికి రూ.50వేలు చొప్పు న సుమారు రూ.7 లక్షలు పెట్టుబడి పెట్టామని, పొలంలోని వాటర్‌ పైపులు, విద్యుత్‌ వైర్లతో సహా కాలిపోయినట్లు బాధిత రైతులు తెలిపారు. ఎకరానికి రూ.లక్ష చొప్పున 12 ఎకరాలకు రూ.12 లక్షల ఆదాయం కోల్పోయామని, ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈక్రమాన చెరుకు పంటకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయా? లేదా ఎవరైనా నిప్పు అంటించారా? అనేకోణంలో అనుమానం వ్యక్తం చేస్తూ.. బాధిత రైతులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

రూ.12 లక్షల నష్టం..

ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement