ఆదివాసీలది గాయాల చరిత్ర | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీలది గాయాల చరిత్ర

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

● రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ● కుమురం భీం విగ్రహం ఆవిష్కరణ

● రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ● కుమురం భీం విగ్రహం ఆవిష్కరణ

దుమ్ముగూడెం : దశాబ్దాల నుంచి ఆదివాసీలది గాయాల చరిత్ర అని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌ మంత్రి సీతక్క అన్నారు. గురువారం ఆదివాసీ సంఘాల ఐక్యకార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో ములకపాడు సెంటర్‌లో ఏర్పాటు చేసిన కుమురం భీం విగ్రహాన్ని ఎమ్మెల్యేలు డాక్టర్‌ తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లుతో కలిసి ఆమె ఆవిష్కరించారు. అనంతరం ములకపాడు వైద్యశాల ఆవరణలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర ఆదివాసీ నాయకులదని అన్నారు. సమ్మక్క– సారలమ్మ, కుమురం భీం ప్రాణాలు అర్పించి ఆదివాసీ హక్కుల కోసం పోరాడారని అన్నారు. ఏజెన్సీలో గిరిజనులు, గిరిజనేతరులు మధ్య సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో కోయ జాతి నుంచి రాష్ట్ర మహిళా మంత్రిగా ఎన్నికై ంది తానేనని, ఆదివాసీ సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడతానని అన్నారు. ప్రగళ్లపల్లి లిప్ట్‌ పథకం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రికి పలువురు వినతిపత్రాలు అందజేశారు. తొలుత భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, చందా లింగయ్య, ఆదివాసీ సంఘాల నాయకులు సొందె వీరయ్య, ఆదివాసీ సంఘాల ఐక్యకార్యాచరణ వేదిక నాయకులు కొమరం దామోదరరావు, కుంజా శ్రీనివాసరావు, సోయం కామరాజు, కణితి రాముడు, తెల్లం హరికృష్ణ, వర్షా ముద్దరాజు, తునికి కామేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement