కారు ఢీకొని ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని ఒకరు మృతి

Oct 17 2026 12:28 AM | Updated on Oct 17 2026 12:28 AM

నిర్లక్ష్య డ్రైవింగ్‌కు నిండు ప్రాణం బలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): నిర్లక్ష్య డ్రైవింగ్‌కు నిండు ప్రాణం బలైన సంఘటన లక్ష్మీదేవిపల్లి మండలం పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా శుక్రవారం జరిగింది. లక్ష్మీదేవిపల్లికి చెందిన గుంటి అనిల్‌ ప్రకాష్‌ (43) తెలిసినవారి కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అప్పు డే ఫోన్‌ రావడంతో రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ఖమ్మానికి చెందిన విద్యుత్‌ శాఖ ఉద్యోగి తంగెళ్లపల్లి శ్రీధర్‌ కారులో ఇల్లెందు వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి అనిల్‌ను ఢీకొట్టింది. అదే వేగంతో వెళ్లి అక్కడే ఉన్న ఆటోను కూడా ఢీ కొట్టింది. అనిల్‌కు తీవ్రగాయాలు కాగా, ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆటోడ్రైవర్‌, కారుకొండ రామవరానికి చెందిన కాకటి సందీప్‌ కూడా గాయపడ్డాడు. పోలీసులు అనిల్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి తల్లిదండ్రులు, భార్య, కుమారుడు ఉన్నారు. భార్య శ్రీదేవి ఫిర్యాదు మేరకు లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ అఖిల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మతిస్థిమితంలేని

వృద్ధుడి అదృశ్యం

భద్రాచలంఅర్బన్‌: పట్టణంలోని ఆర్యవైశ్య సత్రం ఎదురుగా నివాసముంటున్న మతిస్థిమితంలేని వృద్ధుడు యాసరపు లక్ష్మణ్‌ (86) అదృశ్యమయ్యాడు. ఈ నెల 13న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన లక్ష్మణ్‌ తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లేకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ఎస్‌.రాజు తెలిపారు.

బైండోవర్‌ ఉల్లంఘన

రూ.30 వేలు జరిమానా

ఇల్లెందు/ఇల్లెందురూరల్‌: సారా విక్రయం, తయారీ కేసులో బైండోవర్‌ చేసిన మహిళ నిబంధనలు ఉల్లంఘించడంతో ఎకై ్సజ్‌ అధికారులు జరిమానా విధించారు. మండలంలోని ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఇస్లావత్‌ జ్యోతి గతంలో సారా విక్రయిస్తుండగా పట్టుకుని బైండోవర్‌ చేశారు. మళ్లీ సారా విక్రయిస్తుండటంతో శుక్రవారం పట్టుకుని రూ. 30 వేలు జరిమానా విధించినట్లు ఎక్సైజ్‌ సీఐ సీహెచ్‌. నాగేశ్వరరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement