నైనీపై నజరేది? | - | Sakshi
Sakshi News home page

నైనీపై నజరేది?

Oct 16 2026 12:30 AM | Updated on Oct 16 2026 12:30 AM

ఓవర్‌ బర్డెన్‌ తొలగించరేం

కోలిండియా అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం ఈ నెల 13న

వివిధ థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో బొగ్గు నిల్వల వివరాలు

ఓవర్‌ బర్డెన్‌ తొలగింపులో వీడని కష్టాలు వచ్చిన బొగ్గు రవాణా చేసేందుకూ తిప్పలు నైనీని గాడిన పెట్టడంలో సింగరేణి విఫలం

లక్ష్యానికి దూరంగా

పదేళ్ల క్రితం నైనీ బొగ్గు బ్లాకు సింగరేణికి దక్కినా గతేడాది నుంచే బొగ్గు ఉత్పత్తి మొదలైంది. నైనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా ఉంది. అంటే ఏడాదికి కోటి, ప్రతీనెల 8.33 లక్షలు, రోజూ 27,397 మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాలి. కానీ, సింగరేణి సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ నెల 14న రోజువారీ ఉత్పత్తి లక్ష్యం 18,350 మెట్రిక్‌ టన్నులుగా ఉంది. ఈ లెక్కన ఏడాదికి సుమారు 67 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తినే జరుగుతోంది. నిర్దేశిత లక్ష్యానికి 33 లక్షల మెట్రిక్‌ టన్నుల లోటు ఇక్కడ నమోదు అవుతోంది.

తరలింపులో తరుగే

బొగ్గు రవాణాలో మాల్‌గాడీకి సంబంధించి 54 వ్యాగన్లు కలిగిన ఒక రేక్‌ ద్వారా కనిష్టంగా 4,000 టన్నుల బొగ్గును రవాణా చేయొచ్చు. ప్రస్తుతం నైనీలో రోజుకు సగటున 18 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. అంటే ప్రతీ రోజు నాలుగుకు తక్కువ కాకుండా రేకుల్లో బొగ్గును థర్మల్‌ పవర్‌ స్టేషన్లకు రవాణా చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం రోజుకు సగటున పది వేల టన్నుల బొగ్గే రవాణా అవుతోంది. అంటే ఉత్పత్తి జరిగిన బొగ్గులో కనీసం నలభై శాతం నైనీ స్టాక్‌ యార్డ్‌లోనే మిగిలిపోతోంది.

రవాణా కష్టాలు

నైనీ బొగ్గు గని నుంచి సుమారు 30 కి.మీ దూరంలో జరపడా రైల్వేస్టేషన్‌ ఉంది. అక్కడి వరకు నైనీ బొగ్గును లారీల్లో తరలించాల్సి ఉంది. ఈ మార్గం ఇరుకుగా ఉండటంతో స్థానికులు బొగ్గు రవాణాను తరచుగా అడ్డుకుంటున్నారు. ఫలితంగా ఉత్పత్తి చేసిన బొగ్గును వేగంగా తరలించడంలో ఇబ్బందులు వస్తున్నాయి. దీని పర్యావసనాలు తెలంగాణలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం ప్రతీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. ప్రస్తుతం తెలంగాణలో ఏ ఒక్క పవర్‌ స్టేషన్‌లో ఈ స్థాయిలో బొగ్గు నిల్వలు లేవు.

పర్యవేక్షణ కరువు

సింగరేణి వ్యాప్తంగా మొత్తం 39 గనులు ఉన్నాయి. ఇందులో అతి తక్కువ ఖర్చుతో మేలిరకం జీ–9 గ్రేడ్‌ బొగ్గు లభించే గనిగా నైనీకి పేరుంది. ఈ గనిని సమర్థంగా నడిపించాల్సి ఉంది. కానీ, అందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. ఓబీ టార్గెట్‌ చేరుకునేలా, రవాణా కష్టాలు తీర్చేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ రూపొందించడంపై ఇప్పటికై నా మేనేజ్‌మెంట్‌, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది.

భూ ఉపరితం మట్టి తీయడంపై బొగ్గు ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. సింగరేణి అధికారిక లెక్కల ప్రకారమే రోజూ 28,323 మెట్రిక్‌ టన్నుల మట్టిని తొలగించాల్సి ఉంది. కానీ ఈ నెల 14న కేవలం 3,757 టన్నులకే పరిమితమైంది. నెలవారీ లెక్కలు పరిశీలిస్తే ఓబీ తొలగింపు కేవలం 19 శాతమే సాధ్యమైంది. ఈ ఏడాది ఆరంభంలో ఓవర్‌బర్డెన్‌ తొలగింపు టెండర్ల వ్యవహారం వివాదం కావడంతో వాటిని రద్దు చేశారు. ఆ తర్వాత తిరిగి టెండర్లు పిలిచినా ఇంత వరకు ఓబీ తొలగింపు పనులు గాడిన పడలేదు.

థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిల్వలు సరిపోయే

రోజులు

భద్రాద్రి (మణుగూరు) 11

కాకతీయ (భూపాలపల్లి) 11

కేటీపీఎస్‌ (పాల్వంచ) 10

ఎస్‌టీపీఎస్‌ (రామగుండం) 3

సింగరేణి (మంచిర్యాల) 8

సింగరేణి సిగలో కోహినూర్‌ వజ్రం లాంటి నైనీ గనిని సమర్థంగా నడిపించడంలో యాజమాన్యం విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. గని నిర్దేశిత లక్ష్యం మేరకు పని చేస్తే సంస్థ పనితీరు మెరుగుపడటంతోపాటు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్‌ కష్టాలకు చెక్‌ పెట్టే అవకాశం ఉంది.

–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

వార్షిక ఉత్పత్తి లక్ష్యానికి దూరంగా బొగ్గు గని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement