ధనలక్ష్మిగా అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

ధనలక్ష్మిగా అమ్మవారు

Oct 16 2026 12:30 AM | Updated on Oct 16 2026 12:30 AM

భద్రాచలం: సిరిసంపదలు, ఐశ్వర్యాలు ప్రసాదించే జగన్మాత ధనలక్ష్మిగా దర్శనమిచ్చారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం మహాలక్ష్మి అమ్మవారిని ధనలక్ష్మిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వా మివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించగా మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. మారుతి సదనంలో అరణ్యకాండ పారాయణం చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలతో, దసరా సెలవుల భక్తుల రద్దీతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కాగా శుక్రవారం అమ్మవారు ధాన్యలక్ష్మిగా దర్శనమివ్వనున్నారు.

కనుల పండువగా సీతారాముల

నిత్యకల్యాణం

రామాలయంలో సీతారాముల నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం బేడా మండపంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం జరిపారు. కల్యాణ ఘట్టాల్లో భాగంగా స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన నిత్యకల్యాణాన్ని భక్తులు తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement