చుంచుపల్లి: జిల్లాలోని చాతకొండ ఆరో పోలీసు బెటాలియన్‌ను తెలంగాణ స్పెషల్ పోలీస్ డీఐజీ పి.మురళీకృష్ణ మంగళవారం సందర్శించారు. ఆయనకు కమాండెంట్ పీ.సీ.వీ.రమణ స్వాగతం పలకగా... సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం యూనిట్ ఆస్పత్రిని సందర్శించి వైద్య సదుపాయాలు, కావాల్సిన అవసరాలపై ఆరా తీశారు. అంతేకాక బెటాలియన్‌లో అభివృద్ధి పనులను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం ఎస్‌డీఆర్‌ఎఫ్ విభాగాన్ని సందర్శించిన డీఐజీ రక్షణ పరికరాలు, వాటి పనితీరును పరిశీలించాక సిబ్బంది సంక్షేమం, వసతుల కల్పనపై అధికారులతో చర్చించారు. అలాగే, నెల రోజుల శిక్షణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి బహుమతులు అందజేశారు. అసిస్టెంట్ కమాండెంట్లు హెచ్.అబ్దుల్ రషీద్, బి.మరియదాసు, ఏ.వీ.రమణయ్య, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


