టేకులపల్లి: రైతులు శాశ్వత పందిళ్లు నిర్మించుకుని తీగజాతి పంటలు సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి కిషోర్ తెలిపారు. టేకులపల్లి మండలం కోయగూడెం జీపీ పరిధి రావులపాడు, గంగాపురం గ్రామాల్లో పలు వురు సాగు చేస్తున్న కూరగాయల తోటలను మండల ఉద్యాన అధికారి స్రవంతితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ శాశ్వత పందిళ్ల నిర్మాణానికి ఉద్యాన శాఖ ద్వారా ఎకరాకు రూ.లక్ష సబ్సిడీ ఇస్తున్నందున, ఆసక్తి కలిగిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాకర, బీర, సొర, పొట్ల, దొండ వంటి తీగజాతి పంటలకు శాశ్వత పందిళ్లు వేయడం వల్ల పంట నాణ్యత పెరుగుతుందని తెలి పారు. ఆతర్వాత తెగుళ్ల నియంత్రణ, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.


