పోరాటాలకు మద్దతుగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

పోరాటాలకు మద్దతుగా నిలవాలి

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

ఇల్లెందు: స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పాలస్తీనా, క్యూబా, ఇరాన్‌ ప్రజలు చేస్తున్న పోరాటాలకు భగత్‌సింగ్‌ స్ఫూర్తితో దేశ ప్రజలు మద్దతుగా నిలవాలని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు. భగత్‌సింగ్‌ జయంతి వారోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఇల్లెందులో మాస్‌లైన్‌, అనుబంధ సంఘాల ఆధ్వర్యాన కాగడాల ప్రదర్శన నిర్వహించా రు. ఈ సందర్భంగా రంగారావు, నర్సయ్య మాట్లాడుతూ భగత్‌సింగ్‌ వలస ఆధిపత్యాన్ని సవాల్‌ చేస్తూ పోరాడగా బ్రిటీషర్లు వెళ్లిపోయారని తెలి పారు. ఈక్రమాన పాలస్తీనా, క్యూబా, ఇరాన్‌ ప్రజలు ఆధిపత్యాన్ని ఎదుర్కొంటున్నందున ఇక్కడ ప్రజలు సంఘీభావం తెలిపితే అంతర్జాతీయవాద స్ఫూర్తిని సజీవంగా ఉంటుందని చెప్పా రు. కాగా, కేంద్రప్రభుత్వం అమెరికా సామ్రాజ్య వాదానికి తలొగ్గి వాణిజ్య ఒప్పందాలతో దేశయ వ్యవసాయ రంగానికి ఉరి తాళ్లు బిగుస్తోందని ఆరోపించారు. నాయకులు చండ్ర అరుణ, నాయిని రాజు, కాంపాటి పృథ్వీ, యాకుబ్‌షావలీ, బోసు, సావిత్రి, బుర్ర వెంకన్న, బిచ్చా, ఆవుల కిరణ్‌, లక్ష్మణ్‌, బుర్ర రాఘవులు, పూనెం కుమార్‌, పాయం వెంకన్న, మల్లెల వెంకటేశ్వర్లు, శాంతారావు తదితరులు పాల్గొన్నారు.

మాస్‌లైన్‌ నేతలు పోటు రంగారావు, గుమ్మడి నర్సయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement