ముచ్చటగా మూడోసారి.. | - | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడోసారి..

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

సీలింగ్‌ భూముల సర్వేకు రంగం సిద్ధం

తాజాగా గెజిట్‌ విడుదల చేసిన

ప్రభుత్వం

అక్టోబర్‌ 3న మామిడిగుండాలలో గ్రామసభ

ప్రక్రియ ప్రారంభమైంది

హద్దుల నిర్ధారణ లేక..

మామిడిగుండాల రెవెన్యూ సర్వే నంబర్‌ 130 పరిధిలోని భూస్వాముల వద్ద అదనంగా ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని స్థానిక గిరి జనులకు సీలింగ్‌ పట్టాలు పంపిణీ చేసింది. కానీ నాడు అదంతా అటవీ ప్రాంతంగా ఉండటంతో పంపిణీ చేసిన భూమికి అధికారికంగా ఎక్కడా సరిహద్దులు కేటాయించబడలేదు. దీంతో పట్టాలు అందుకున్న స్థానిక గిరిజనులు తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో భూమిని చదును చేసి వ్యవసాయం ప్రారంభించారు.

రెండు దఫాలుగా ఇలా..

రైతులు తమకు అనుకూలంగా ఉన్న భూమిలో సాగు చేస్తూ విస్తీర్ణాన్ని పెంచుతూ వచ్చారు. ఈ క్రమంలో తమకు రావాల్సిన భూమిపై 2010 నుంచి భూస్వాములు దృష్టి సారించడంతో నాటి నుంచి ఇరువర్గాల మధ్య వివాదం ప్రారంభమైంది. దీంతో 2017లో ఉన్నతాధికారుల ఆదేశంతో అప్పటి తహసీల్దార్‌ ప్రకాష్‌రావు ప్రభుత్వ సర్వేయర్లతో సర్వేకు ఉపక్రమించగా.. రైతులు అడ్డుకున్నారు. ఆతర్వాత 2021లో నాటి ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ జోక్యంతో జేసీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ, తహసీల్దార్‌ పర్యవేక్షణలో ప్రభుత్వ సర్వేయర్లు ఎనిమిది నెలల పాటు సర్వే చేసి తుది నివేదికను అప్పటి జేసీకి అందజేశారు. కానీ సర్వే ప్రక్రియపై భూస్వాములు కోర్టును ఆశ్రయించడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది.

గెజిట్‌ ద్వారా మూడోసారి..

సీలింగ్‌ భూములకు సరిహద్దులతో కూడిన రెవెన్యూ పట్టాలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య ద్వారా రెవెన్యూ మంత్రి పొంగులేటికి స్థానిక రైతులు విన్నవించారు. స్పందించిన మంత్రి సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కానీ సమస్య పరి ష్కా రం దిశగా అడుగులు పడకపోవడంతో జిల్లా అధికా రుల సమీక్షలో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారుల్లో కదలిక ప్రారంభమైంది. దీనికితోడు ప్రభుత్వం కూడా జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక భూములను గుర్తించి సమగ్ర సర్వే కోసం గెజిట్‌ విడుదల చేసింది. తాజా గెజిట్‌ ఆధారంగా శాటిలైట్‌ సర్వే చేపట్టి వాస్తవ భూవిస్తీర్ణం, సాగు వివరాలను గుర్తించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికోసం అక్టోబర్‌ 3వ తేదీన గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సమక్షంలో మామిడిగుండాలలో గ్రామసభ నిర్వహించి సర్వేకు ఉక్రమించాలని నిర్ణయించారు.

అవరోధాలను అధిగమిస్తేనే..

సర్వే నంబర్‌ 130 పరిధిలో అధికారులు పలు దఫాలుగా వివిధ పేర్లతో గిరిజనులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో భూదాన్‌లో 100 ఎకరాలు, 38ఈలో 150, డిక్లేర్‌ పట్టాలు 150, 452 మంది గిరిజనులకు 2,850 ఎకరాల విస్తీర్ణంలో సీలింగ్‌ పట్టాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా 2021లో అప్పటి జేసీ పర్యవేక్షణలో నిర్వహించిన సర్వే నివేదిక ఆధారంగా 798 మంది రైతులు 2490.04 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈక్రమాన ఎంత మంది రైతులు సీలింగ్‌ పట్టాలు కలిగి ఉన్నా రు.. అందులో సాగు చేయని వారు ఎంతమంది, ఇతరుల నుంచి కొన్నవారు, ఆక్రమించుకున్న వారెందరు, వారసత్వంగా హక్కు పొందినవారు ఎంత మంది వంటి విషయాలను నాటి సర్వేలో గుర్తించలేదు. వీటిపై స్పష్టత వస్తేనే సీలింగ్‌ భూవివాదానికి పరిష్కారం దొరుకుతుందని స్థానికులు చెబుతున్నారు.

మూడున్నర దశాబ్ధాల క్రితం భూ గరిష్ట పరిమితి చట్టం అమలుతో ప్రభుత్వం గిరిజనులకు సీలింగ్‌ పట్టాలు పంపిణీ

చేసింది. కానీ ఆ పట్టాల్లో సరిహద్దులను పేర్కొనని ఫలితంగా కాలక్రమేనా సమస్య జఠిలమైంది. దశాబ్దాల వివాదాలకు తెరదించుతూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో పభుత్వం సమగ్ర సర్వే కోసం గెజిట్‌ విడుదల చేసింది.

– ఇల్లెందురూరల్‌

మామిడిగుండాల సీలింగ్‌ భూవివాదం శాశ్వత పరి ష్కారం దిశగా ప్రక్రియ ప్రారంభమైంది. సమగ్ర సర్వే కోసం ప్రభుత్వం తాజాగా గెజిట్‌ విడుదల చేసింది. ఉన్నతాధికారుల సమక్షంలో గ్రామసభ నిర్వహించి వారి సూచనలతో శాటిలైట్‌ ద్వారా భూసర్వే ప్రారంభిస్తాం.

– షాఖాసీం, తహసీల్దార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement