విత్తనోత్పత్తికి రైతులు ముందుకు రావాలి | - | Sakshi
Sakshi News home page

విత్తనోత్పత్తికి రైతులు ముందుకు రావాలి

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

బూర్గంపాడు: ఏటా విత్తన కంపెనీలపై ఆధారపడకుండా రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేయడంపై దృష్టి సారించాలని వరంగల్‌కు చెందిన ప్లాంట్‌ బ్రీడింగ్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వై.ప్రశాంత్‌ సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బూర్గంపాడు పీఏసీఎస్‌లో సోమవారం రైతులకు ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. వరి విత్తనోత్పత్తిపై దృష్టి సారిస్తే రైతులకు ఖర్చు తగ్గడమే కాక నాణ్యమైన దిగుబడి వస్తుందన్నారు. అనంతరం విత్తన వరి సాగులో జాగ్రత్తలు, కల్తీ మొక్కల తొలగింపు, విత్తనోత్పత్తిపై అవగాహన కల్పించారు. ఏడీఏ తాతారావు, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ భరత్‌, పీఏసీఎస్‌ సీఈఓ ప్రసాద్‌, రైతులు పాల్గొన్నారు.

అనధికార దత్తతపై

కౌన్సెలింగ్‌

ఇల్లెందురూరల్‌: మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన దంపతులకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా, రెండు వారాల క్రితం మూడో కుమారుడు జన్మించాడు. ఈమేరకు సమీప గ్రామంలో పిల్లలు లేని దంపతులకు ఆ బడ్డను దత్తత ఇచ్చారు. ఈ విషయం బయటకు రావడంతో చట్ట ప్రక్రియ లేకుండా దత్తత ఇవ్వడంపై ఐసీడీఎస్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు అంగన్‌వాడీ టీచర్‌, సూపర్‌వైజర్‌ ఫిర్యాదుతో తల్లిదండ్రులు, దత్తత తీసుకున్న దంపతులకు సోమవారం కొత్తగూడెం డీసీడీఓ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

బార్‌ ఏర్పాటుకు

దరఖాస్తుల ఆహ్వానం

కొత్తగూడెం అర్బన్‌: జిల్లాలోని అశ్వారావుపేట పరిధిలో బార్‌ ఏర్పాటుకు అనుమతి మంజూరైంది. ఈమేరకు ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.లక్ష రుసుముతో వచ్చే నెల 12వ తేదీలోగా ఖమ్మం డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం, జిల్లా సూపరింటెండెంట్‌ కార్యాలయం లేదా హైదరాబాద్‌లోని కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. కాగా, ఈ బార్‌కు ఏటా రూ.30లక్షల లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తే వచ్చే నెల 16వ తేదీన లక్కీడ్రా ద్వారా బార్‌ కేటాయిస్తామని సూపరింటెండెంట్‌ తెలిపారు.

అదనపు కలెక్టర్‌కు

తప్పిన ప్రమాదం

నార్కట్‌పల్లి: కారు, కంటైనర్‌ లారీని ఢీకొనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్‌కు ప్రమాదం తప్పింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపాన కామినేని ఆస్పత్రి వద్ద సోమవారం చోటుచేసుకుంది. భద్రాద్రి అదనపు కలెక్టర్‌ దారా వేణుగోపాల్‌ సోమవారం ఉద యం హైదరాబాద్‌ నుంచి కొత్తగూడెంకు కారులో వెళ్తున్నారు. మార్గమధ్యలో కామినేని హాస్పిటల్‌ వద్ద ఫ్లైఓవర్‌ దిగుతుండగా కంటైనర్‌ లారీ యూటర్న్‌ చేసుకుంటోంది. దీంతో లారీని ఢీకొనడంతో కారు పూర్తిగా దెబ్బతింది. ఘటనలో సురక్షితంగా బయటపడిన వేణుగోపాల్‌, వెనుక వస్తు న్న సివిల్‌ సప్లయీస్‌ అధికారి కారులో వెళ్లిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు నార్కట్‌పల్లి ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement