13 మందికి హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి | - | Sakshi
Sakshi News home page

13 మందికి హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

ఖమ్మంక్రైం: వివిధ పోలీసుస్టేషన్లలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తూ హెడ్‌కానిస్టేబు ళ్లుగా పదోన్నతి పొందిన పలువురిని సీపీ సునీల్‌దత్‌ సోమవారం అభినందించారు. 2000 బ్యాచ్‌కు చెందిన 13మందికి పదోన్నతి లభించింది. ఇందులో మహబూ బాబాద్‌ జిల్లాకు ఆరుగురు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఏడుగురిని కేటా యించారు. పదోన్నతి పొందిన వారిలో టి.శ్రీనివాసరావు, శ్రీనివాస్‌, రవికుమార్‌, ముత్తయ్య, వడ్డే కిషోర్‌, కరుణాకర్‌రావు, నవజీవన్‌కుమార్‌, సుశీల్‌కుమార్‌, అలు, శ్రీనివాసరావు, రవికుమార్‌, సీతారామరాజు, సర్దార్‌ సింగ్‌ ఉన్నారు.

కార్పొరేటర్‌ సహా 11 మందిపై అట్రాసిటీ కేసు

పాల్వంచ: గణేష్‌ శోభాయాత్ర సందర్భంగాజరిగిన ఘర్షణలో 11మందిపై సోమవారం కేసు నమోదైంది. పాల్వంచ జయమ్మ కాలనీలో గణేష్‌ శోభా యాత్ర జరుగుతుండగా ట్రాక్టర్‌ డ్రైవర్‌ గుగులోతు రమేష్‌, ఆయనతో వారి వద్దకు వచ్చిన కొందరు వివాదానికి దిగారు. కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. ఘట నపై బాధితుల ఫిర్యాదుతో కార్పొరేటర్‌ సింధు తపస్వితో పాటు అఖిల్‌, విద్యాసాగర్‌, ఎం.డీ.అజ్మద్‌ పాషా, వెంకన్న సహా 11మందిపై సోమవారం అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. ఇదిలా ఉండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా ఫిర్యాదుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement