పాల్వంచరూరల్: ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షాపాతం నమోదైన నేపథ్యాన గ్రామాల్లో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి అనూష సూచించారు. పాల్వంచ మండలం జగన్నాథపురం రైతు వేదికలో సోమవారం జీపీ పనుల ప్రణాళిక తయారీపై పాల్వంచ, బూర్గంపాడు మండలాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వీబీజీ రాంజీ సిబ్బందికి శిక్షణ ఇచ్చా రు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ గ్రామాల్లో నీటి వనరుల గుర్తించి వాటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించాలని తెలి పారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ తిరుమలేష్, ఎంపీడీఓలు పి.రాజారావు, జమలారెడ్డి, ఎంపీఓలు శబ్నా, రామకృష్ణతో పాటు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు బి.అనిత, రాజరత్నం, రాజు, పొరండ్ల రంగా, వెంకటేశ్వర్లు, చెన్నకేశవులు, రఘుపతి, విజయలక్ష్మి పాల్గొన్నారు.


