భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించారు. గతంలో నగదు లెక్కింపు చిత్రకూట మండపంలో జరిగేది. కానీ ఆలయ అభివృద్దిలో భాగంగా మండపాన్ని తొలగించగా.. ఈసారి వేదికను మిథిలా స్టేడియంలోని రామసేవా మండపానికి మార్చారు. ఈక్రమాన కానుకలతో కూడిన సంచులను ఈఓ దామోదర్‌రావు ఆధ్వర్యాన సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సభ్యులు
మండపానికి తీసుకెళ్లారు. తెల్లని వస్త్రాలతో తలపై కానుకల సంచులతో వీరు వరుస
క్రమంలో ముందుకు సాగడం ఆకట్టుకుంది. – భద్రాచలం


