జిల్లా బాక్సింగ్‌ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా బాక్సింగ్‌ జట్ల ఎంపిక

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యాన అండర్‌–14 బాలుర, అండర్‌–17 బాలురు, బాలికల విభాగాల్లో బాక్సింగ్‌ జట్లను ఎంపిక చేశారు. కొత్తగూడెంలోని సీఈఆర్‌ క్లబ్‌లో సోమవారం జరిగిన ఎంపిక పోటీలకు 80 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబర్చిన 18మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అండర్‌–14 బాలుర విభాగం వివిధ బరువుల కేట గిరీల్లో కె.సాకేత్‌, టి.మణికంఠ, జె.రేవంత్‌కుమార్‌, జె.హరీష్‌, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇక అండర్‌–17 బాలుర విభాగంలో ఆర్‌.గణేష్‌, ఎం.గణేష్‌, వి.సాయికిరణ్‌, వి.తనుష్‌, టి.నాగరాజు, ఎన్‌.వర్షిత్‌, బి.విశ్వేశ్‌, జి.అభిరామ్‌, బి.గణేష్‌, బాలికల విభాగంలో కె.భావన, ఎస్‌కె.షఫీ షరీన్‌, ఎం.అమృత జాస్మిన్‌, కె.సానియా సత్తా చాటి మంచిర్యాలలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి, ఎస్‌జీఎఫ్‌ స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి బావుసింగ్‌, అబ్జర్వర్‌ నరేష్‌, కోచ్‌ ఆర్‌.శ్రీనివాస్‌, బాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి మట్టపర్తి రమేష్‌తో పాటు నాయకులు పీతాంబరం అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement