రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Sep 28 2026 12:35 AM | Updated on Sep 28 2026 12:35 AM

కొణిజర్ల: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదా నికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రిజిల్లా ము లకలపల్లి మండలం రాజుగూడెంకు చెందిన గోనెల రాజేష్‌(22) ఖమ్మం వైఎస్‌ఆర్‌ కాలనీలో ఉంటూ వైరాలోని ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివా రం ఉదయం రాజుపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా తనికెళ్ల వద్ద ఫోన్‌ రావడంతో యూటర్న్‌ తీసుకుంటున్నాడు. ఈ సమయాన వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో రాజేష్‌ తలకు తీవ్రగాయాలు కావడంతో 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఆయన తండ్రి దివ్యాంగుడు కాగా, తల్లి పుష్ప కూలీ పనులకు వెళ్తూ చదివించింది. అటవీ ఉద్యోగ పరీక్షకు సిద్ధమవుతున్న యువకుడి మృతి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సూరజ్‌ తెలిపారు.

భార్య పుట్టింటికి.. భర్త బలవన్మరణం

అశ్వారావుపేటరూరల్‌: హాస్టల్‌ ఉన్న పిల్లలను చూసేందుకు కలిసి వెళ్లిన దంపతులు తిరిగి వస్తుండగా జరిగిన గొడవ విషాదానికి దారితీసింది. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి మోడల్‌ కాలనీకు చెందిన తగరం వెంకటేశ్వరరావు(35) రాడ్‌బెండింగ్‌ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య స్వర్ణలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన అతిగా మద్యం సేవించి కుటుంబ బాధ్యతలను పట్టించుకోవడం లేదని భార్య గొడవ పడి వారం క్రితం ఆసుపాకలోని పుట్టింటికి వెళ్లింది. ఇద్దరు కుమారులు దమ్మపేట మండలం మందలపల్లి ప్రభుత్వ వసతి గృహాంలో ఉండి చదువుతుండగా, ఆదివారం దంపతులిద్దరూ వెళ్లి చూశారు. తిరిగి వస్తుండగా భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరగ్గా స్వర్ణలత పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో వెంకటేశ్వరరావు ఇంటికి చేరుకుని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఆయన తండ్రి సిద్దయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ టి.యయాతి రాజు తెలిపారు.

వినాయక నిమజ్జన ఊరేగింపులో ఘర్షణ

కత్తులతో బెదిరింపులు

పాల్వంచ: వినాయక విగ్రహ నిమజ్జన ఊరేగింపులో పాత కక్షలతో యువకుడిపై దాడి చేసి కత్తులతో బెదిరించారు. పోలీసుల కథనం మేరకు వివరాలి లా ఉన్నాయి. ఈ నెల 26వ తేది రాత్రి సమయంలో నవభారత్‌ గాంధీనగర్‌లో వినాయక నిమజ్జనం ఊరేగింపు ఇంటిముందుకు వచ్చిన సమయంలో గడ్డం సాయిరామ్‌ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్లాడు. ఈక్రమాన పాత కక్షలతో కొల్లిపాక అరుణ్‌, అతడి స్నేహితులు హరి, మాధవ్‌, భూక్యా పవన్‌లు మూకుమ్మడిగా సాయిరామ్‌ను తీవ్రంగా దాడి చేశారు. అరుణ్‌ చేతి కడియంతో కొట్టడంతో సాయిరామ్‌ ఎడమ కంటిపై బలమైన గాయమైంది. అడ్డొచ్చిన అతడి తల్లిదండ్రులను తోసేశారు. స్థానికులు విడిపించేందుకు ప్రయత్నించగా కత్తులు చూపించి చంపుతామని బెదిరించి పరారయ్యారు. సాయిరామ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement