● ఘటన స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీమ్ ● పోలీసుల అదుపులో నిందితులు?
కరకగూడెం: మండలంలోని గొత్తికోయ అశ్వాపురంపాడు గ్రామానికి చెందిన వజ్జ భీమరాజుపై శనివా రం జరిగిన హత్యాయత్నం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆదివారం ఘటనాస్థలాన్ని క్లూస్ టీమ్‌తో కలిసి ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పీవీఎన్ రావు పరిశీలించారు. ఘటనకు సంబంధించిన ఆధారా లను సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తు తం భీమరాజు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.
పాత కక్షలే కారణం..
పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ దాడి వెనుక పాత కక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన సీపీఎం నేత, గ్రామ పెద్ద కొవ్వాసి వెంకటేష్‌ను హత్య చేసిన కేసులో భీమరాజు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. జైలు నుంచి విడుదలయ్యాక గ్రామంలో సాధారణ జీవితం గడుపుతున్న భీమరాజుపై వెంకటేష్ కుమారుడు, బావమరిది పగ పెంచుకుని ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకు న్నారు. మరో ఇద్దరి సాయంతో వేటకొడవళ్లతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం.
తప్పించుకున్న చిన్నారి..
శనివారం భీమరాజు గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో పశువులను మేపుతున్న సమయాన ఈ దాడి జరుగగా.. భీమరాజుతో పాటు ఆయన కుమార్తె కూడా అక్కడే ఉంది. దుండగుల బారి నుంచి ఆ చిన్నారి తప్పించుకుని గ్రామానికి చేరుకుని తల్లికి విషయం చెప్పింది. వెంటనే బాధితుడి భార్య పోలీసులకు సమాచారం అందించి ఘటనా స్థలా నికి వెళ్తుండగా, తన భర్తపై దాడి చేసి తిరిగి వస్తున్న నలుగురు గ్రామస్తులను చూసింది. ఆ నలుగురు వ్యక్తులే ఈ హత్యాయత్నానికి ఒడిగట్టారని ఆమె పోలీసులు, మీడియా ముందర వారి పేర్లను బహిరంగపరిచింది. దీంతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా, ఇద్దరు నిందితులు పోలీసులకు లొంగిపోయారని సమాచారం. ఈ విషయంపై ‘సాక్షి’సీఐను వివరణ కోరగా ఎవ్వరిని కూడా అదుపులో తీసుకోలేదని పేర్కొన్నారు.


