వెదురు పెంపకాన్ని ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

వెదురు పెంపకాన్ని ప్రోత్సహించాలి

Sep 19 2026 8:32 AM | Updated on Sep 19 2026 8:32 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): వెదురు పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంతోపాటు నేలకోతను నియంత్రించవచ్చని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవా న్ని పురస్కరించుకుని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వెదురు వేగంగా పెరిగే సహజ వనరు మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. వెదురును ఇళ్ల నిర్మాణం, ఫర్నిచర్‌, కాగితం, హస్తకళలు, అలంకరణ వస్తువులు తదితర అనేక రకాల ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తున్నారని తెలిపారు. వెదురు ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌పై అవసరమైన శిక్షణ, అవగాహన కల్పించడం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. అనంతరం వెదురుతో తయారు చేసిన బొకే కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ అధికారిణి విజయలక్ష్మి, మేదరి కుల సంఘ నాయకులు కొంటు శ్రీనివాస్‌, స్వ రూప, సింధూజ, కళావతి, రమాదేవి, పిల్లి శీను, సోమయ్య, బొల్లం శ్రీనివాస్‌, ప్రవల్లిక, కళాకారులు, చేతి వృత్తిదారులు పాల్గొన్నారు.

టెలికాం ప్రాజెక్టులపై సమీక్ష

కేంద్ర ప్రభుత్వ డిజి టల్‌ భారత్‌ నిధి (డీబీఎన్‌) నిధులతో చేపడుతున్న టెలికాం ప్రాజెక్టుల పురోగతి, ప్రస్తుత టెలికాం మౌలిక సదుపాయాల స్థితిపై టెలికమ్యూనికేషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డి భాస్కరరావు, ఎన్‌ సత్యనారాయణలు శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అంకిత్‌ను కలిసి వివరించారు. 16 ప్రాంతాలలో 4జి సాచురేషన్‌ ప్రాజెక్టు సైట్లకు భూసేకరణ పెండింగ్‌లో ఉందని తెలిపారు. భూముల గుర్తింపు, కేటా యింపు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ ప్రకారం ఏదైనా తవ్వకం పనులు చేపట్టే ముందు సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా కాల్‌ బిఫోర్‌ యు సాగ్‌ యాప్‌ను ఉపయోగించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. దీంతో స్పందించిన కలెక్టర్‌ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఏజీఎం సుభాష్‌, జేటీఓ సందీప్‌, బాలకృష్ణ, సైదులు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లక్ష్మణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పాల్వంచ ఆస్పత్రిలో తనిఖీ

పాల్వంచ: పాల్వంచలోని ఏరియా ఆస్పత్రిలో కలెక్టర్‌ అంకిత్‌ శుక్రవారం తనిఖీ చేశారు. ఐపీ, ఎమర్జెన్సీ, డయాలసిస్‌, బ్లడ్‌ బ్యాంక్‌, ఆపరేషన్‌ థియేటర్లను పరిశీలించారు. జ్వరాల కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెడ్ల కొరత, అదనపు అంతస్తు నిర్మాణ సమస్యలను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ముక్కంటేశ్వరరావు వివరించగా, ఇంజనీరింగ్‌ విభాగంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సూచించారు. జూలూరుపాడులో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని రోగుల బంధువుల విన్నవించారు. తహసీల్దార్‌ దారా ప్రసాద్‌, ఆర్‌ఎంఓ సోమరాజుదొర, సిబ్బంది పాల్గొన్నారు.

‘సర్‌‘ హియరింగ్‌ వేగవంతం చేయాలి

కొత్తగూడెంఅర్బన్‌: ‘సర్‌’లో హియరింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొత్తగూడెం తహసీల్దార్‌ కార్యాలయంలో హియరింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. నోటీసులు అందుకున్న ఓటర్లతో మాట్లాడారు. వారి తెచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పీఎంశ్రీ పథకంలో కొనసాగుతున్న కూలీలైన్‌ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. వంటశాలను పరిశీలించి, పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement