150 కేజీల మహా లడ్డూ ప్రసాదం
పాల్వంచ/పాల్వంచరూరల్: పట్టణం, మండలాల్లోని పలు మండపాల్లో వినాయకుడిని శుక్రవారం కరెన్సీ నోట్లతో అలంకరించారు. గట్టాయిగూడెంలో గణపతి విగ్రహాన్ని రూ.11 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. కమిటీ సభ్యులు లక్ష్మారెడ్డి, మహేష్, సాయి రాఘవ, వికాస్, కరుణాకర్, గోపి, సాయితేజ తదితరులు పూజలు చేశారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో వినాయకుడిని రూ. లక్ష కరెన్సీ నోట్లతో అలంకరించారు. అనంతరం కుంకుమార్చన పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా మంజుల, ఉపసర్పంచ్ మూలగుండ్ల ప్రేమ్‌కుమార్, భూక్యా కాంతమ్మ, నక్క కుమారి, కృష్ణకుమారి, మమత, రమ్య, దుర్గ, మంగ,శి వజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బాపూజీనగర్‌లో ఏర్పాటు చేసిన మండపంలో వినాయకుడిని రూ.కోటి కరెన్సీ నోట్లతో అలంకరించారు.
భద్రాచలంటౌన్: పాత మార్కెట్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా 150 కేజీల భారీ గణేష్ మహా లడ్డూను భక్తులకు ప్రసాదంగా సమర్పించారు. సుమారు రూ.50 వేల విలువైన లడ్డూను కార్తికేయ ఎంటర్‌ప్రైజెస్ ప్రొప్రైటర్ బొజ్జా సాయికిరణ్–ప్రణీత దంపతులు వితరణ చేశారు.


