25లోగా అందరికీ యూనిఫామ్‌ | - | Sakshi
Sakshi News home page

25లోగా అందరికీ యూనిఫామ్‌

Sep 19 2026 8:32 AM | Updated on Sep 19 2026 8:32 AM

భధ్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులందరికీ యూని ఫామ్‌ అందించాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్‌ ఆదేశించారు. ఐటీడీఏ నుంచి శుక్రవారం ఆయన ఉమ్మడి జిల్లాలోని అధికారులు, హెచ్‌ఎంలు, వార్డెన్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈనెల 25వ తేదీలోగా యూనిఫామ్‌ అందించేలా అవసరమైతే మహిళా సంఘాల సభ్యు ల సంఖ్య పెంచాలని తెలిపారు. అలాగే, అధికారులు తమ పరిధిలోని పాఠశాలల్లో ఉద్దీపకం, వారధి పుస్తకాల ద్వారా అందుతున్న బోధనపై దృష్టి సారించాలని, ఈ సమయాన ఫొటోలు దిగి పోస్ట్‌ చేయాలని తెలిపారు. కాగా, సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులను హెచ్‌ఎంలు రిలీవ్‌ చేసి, విధుల్లో చేర ని వారి వేతనం నిలిపివేయాలని ఆదేశించారు. అలాగే, ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ కోసం విద్యార్థులకు కుల, నివాసం, ఆదాయం, ఆధార్‌ ధ్రువీకరణ పత్రాలు అందేలా ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. వీసీలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీ చందన తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు క్రీడల్లో పాల్గొనాలి

విద్యార్ధులు చదువుతో పాటు క్రీడల్లోనూ పాలు పంచుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఐటీడీఏ పీఓ రాహుల్‌ సూచించారు. భద్రాచలం గురుకులం జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఎస్‌జీ ఎఫ్‌ఐ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న మండల స్థాయి పాఠశాలల క్రీడాపోటీలను శుక్రవారం పీఓ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాపోటీల్లో పాల్గొనడంతో గెలుపోటములను సమానంగా స్వీకరించే గుణం అలవడుతుందని తెలిపారు. భద్రాచలం సర్పంచ్‌ పూనెం కృష్ణ, ఎంఈఓ బెక్కంటి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, రామచందర్రావు, రాజా శ్రీనివాసరావు, హేమలత, రమణ తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement