భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఘనంగా జరిగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో వైఖానస ఆగమోక్తంగా స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ప్రత్యేక ఆరాధనా క్రతువులను ఆలయ అర్చకులు వేదమంత్రాల మధ్య నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణ మహోత్సవం కోసం మిథిలా స్టేడియంలోని రామసేవా మండపంలో మూర్తులను కొలువుదీర్చారు. విఘ్న నివా రకుడు విశ్వక్సేనుల వారి పూజతో ప్రారంభమైన ఈ దివ్య క్రతువులో పుణ్యావాచనం, మంగళవాయిద్యాల ధ్వనుల నడుమ కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ గావించారు. అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు కల్యాణ వేడుకను తిలకించి ఆనందభరితులయ్యారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించా రు. మండలంలోని శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరా జనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలపై వినతులు
దుమ్ముగూడెం: మండలంలోని ములకపాడు విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన వినియోగదారుల సదస్సులో అధికారులు స్వీకరించారు. విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, ఓల్టేజీ హెచ్చుతగ్గులు, లోపాలు ఉన్న మీటర్లు మార్చడం, నూతన సర్వీసులు మంజూరు, అదనపు లోడు క్రమబద్ధీకరణ,వంగిపోయిన పోల్స్, మిడిల్ పోల్స్, వ్యవసాయ మోటార్ కనెక్షన్లు, వీధిలైట్లు వైర్లు తది తర సమసల్యపై వినియోగదారులు వినతి పత్రాలు అందజేశారు. సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ మాధవరావు, సభ్యులు శేషారావు, సత్యనారా యణ, రామారావు, విద్యుత్‌శాఖ అధికారులు మహేందర్, జీవన్‌కుమార్, శ్రీధర్ పాల్గొన్నారు.


