టేకులపల్లి: టేకులపల్లి సెంటర్‌లోని వినాయక మండపంలో కొలువుదీరిన బొజ్జ గణపయ్యకు నందిని ట్రేడర్స్ నిర్వాహకులు నాగినేని నరసింహారావు, ఆయన కుమారుడు రాఘవ 166 కేజీల మహా లడ్డూను నివేదనగా సమర్పించారు. ఏటా భారీ లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నారు. ఇక్కడ 2003 నుంచి వేడుకలు నిర్వహిస్తుండగా కేజీ లడ్డూతో నివేదన మొదలైంది. గతేడాది 156 కేజీల లడ్డూను నివేదించగా, ఈసారి 166 కేజీల లడ్డూను సమ్పరించారు. జాగృతి ట్రేడర్స్ నిర్వాహకుడు మూడ్ రాజ్‌కుమార్ కూడా గణేషుడికి 126 కేజీల లడ్డూను వితరణ చేశాడు.


