ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి)/చండ్రుగొండ: రైతులు ప్రకృతి సేద్యంపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) బాబూరావు అన్నా రు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద పెద్దిరెడ్డిగూడెం రైతు వేదికలో మంగళవారం ప్రకృతి వ్యవసాయ కిట్లను అన్నదాతలకు అందజేశారు. పోకలగూడెం క్లస్టర్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బెండాలపాడు, రావికంపాడు గ్రామాల రైతులకు జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధిగా పంటమార్పిడి పాటించాలని చెప్పారు. ఆవు పేడ, ఆవు మూత్రం, జీవామృతం, ఘన జీవామృతం వంటి సహజ వనరులను వినియోగించాలని సూచించారు. ములకలపల్లి రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఓ అరుణ్‌బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ వేమలు నరేష్, కొర్సా ఆదిలక్ష్మి, తుర్రం శ్రీను, బొర్రా లలిత, అధికారులు రవికుమార్, అనూష, సంధ్యారాణి, రాహుల్, సూరిబాబు తోపాటు బొర్ర సురేష్, బానోత్ బాలు, వీసం శ్రావణి పాల్గొన్నారు.
డీఏఓ బాబూరావు


