భద్రాచలంటౌన్: పర్యావరణ పరిరక్షణలో భద్రాచలానికి చెందిన ‘యంగ్ బాయ్స్ యూత్’ అసోసియేషన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. యూత్ సభ్యులు గత 22 ఏళ్లుగాఉత్సవాలు నిర్వహిస్తుండగా.. పదేళ్ల నుంచి మట్టి వినాయకుడినే ప్రతిష్ఠిస్తున్నారు. ఈ ఏడాది సుమారు రూ.3 లక్షల వ్యయంతో 25 అడుగుల భారీ మట్టి గణపతిని సిద్ధం చేయించారు. నిపుణులైన కళాకారులు దాదాపు రెండు నెలల పాటు శ్రమించి ఈ ప్రతిమను రసాయనాలు, కృత్రిమ రంగులు వాడకుండా కేవలం సహజసిద్ధమైన మట్టి, జూట్‌తో తీర్చిదిద్దారు. ఉత్సవాల అనంతరం విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేయనున్నారు.


