పతకాలు సాధించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పతకాలు సాధించడమే లక్ష్యం

Sep 10 2026 12:27 AM | Updated on Sep 10 2026 12:27 AM

భద్రాచలంటౌన్‌: ప్రపంచ పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌లో పతకం సాధించడమే లక్ష్యమని జిల్లా పవర్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ జీవీ రామిరెడ్డి తెలిపారు. అక్టోబర్‌ 15 నుంచి 24 వరకు అమెరికాలోని నెవాడా (రెనో)లో జరిగే వరల్డ్‌ పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌–2026 పోటీల్లో భద్రాచలానికి చెందిన డి.వి.శంకర్‌రావు దేశం తరఫున పాల్గొంటున్నాడని పేర్కొన్నారు. పోటీలకు వెళ్లేందుకు ఆర్థికసాయం కోసం తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ వీసీ, ఎండీ సోనీ బాలదేవికి వినతిపత్రం సమర్పించగా సానుకూలంగా స్పందించారని తెలి పారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు భోగాల శ్రీని వాస్‌రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

ఫామ్‌ పాండ్ల పరిశీలన

చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వీబీజీ రామ్‌జీ పథకంలో చేపడుతున్న అభివృద్ధి పనులను బుధవారం డీఆర్‌డీఓ ఎం.విద్యాచందన పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతపై ఆరా తీశారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. లక్ష్మీదేవిపల్లి ఎంపీడీఓ సుస్మిత, సర్పంచులు, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మామిడి తోటలో

‘మత్తడి’ విందు

ఇల్లెందు: తాగునీటి చెరువు మత్తడి పడిందని మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం కాంట్రాక్టర్ల భాగస్వామ్యంతో మొండితోగు రహదారిలోని మామిడి తోటలో పాలకవర్గం, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, కార్మికులతో కలిపి బుధవారం విందు ఏర్పాటు చేశారు. గతంలో ఇల్లెందు తాగునీటి చెరువు అలుగు పడితే అక్కడి కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలుచేసేవారు. కానీ ఈసారి మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు, కాంట్రాక్టర్ల భాగస్వామ్యంతో విందు ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్ధలతో కట్టమైసమ్మ, కాళీమాత అమ్మవార్ల పూజలు చేయాల్సిందిపోయి, విందు నిర్వహించడం విమర్శలకు దారితీసింది. ఈ విషయమై మున్సిపల్‌ డీఈ నవీన్‌ను వివరణ కోరగా.. మున్సిపల్‌ నిధులతో కాదని, వ్యక్తిగత నిధులతో విందు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఏఐటీయూసీ రాష్ట్ర

కార్యదర్శిగా ప్రసాద్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం)/అశ్వాపురం: కరీంనగర్‌లో ఈ నెల 6, 7, 8 తేదీల్లో జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల్లో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో జిల్లా నుంచి 16 మంది కార్మిక నాయకులకు ప్రాతినిధ్యం దక్కింది. రాష్ట్ర కార్యదర్శిగా నరాటి ప్రసాద్‌, కార్యవర్గ సభ్యులుగా కంచర్ల జమలయ్య, జి నాగేష్‌, వేల్పుల మల్లికార్జున్‌ మరికొందరు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్‌ మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.

తిరుమలకుంట వాసికి డాక్టరేట్‌

అశ్వారావుపేటరూరల్‌: మండలంలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన కొనకళ్ల వరలక్ష్మి డాక్టరేట్‌ సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ పట్టాను ప్రదానం చేశారు. ప్రొఫెసర్‌ ఉపేందర్‌ రెడ్డి పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్‌ ఫిక్స్‌డ్‌ పాయింట్‌ రిజల్ట్స్‌ ఇన్‌ వేరియస్‌ మెట్రిక్‌ స్పేసెస్‌’అనే అంశంపై చేసిన పరిశోధన పూర్తి చేశారు. రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా, ఓయూ వీసీ కుమార్‌ చేతుల మీదుగా డాక్టరేట్‌ అందుకున్నారు.

ఎన్‌ఎస్‌యూఐ

జిల్లా అధ్యక్షుడిగా సురేష్‌

కొత్తగూడెంఅర్బన్‌: ఎన్‌ఎస్‌యూసీ జిల్లా అధ్యక్షుడిగా ఏ.సురేష్‌ నాయక్‌ నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి బుధవారం వివిధ జిల్లాల అధ్యక్షుల నియామకాలు చేపట్టారు. సురేష్‌ నియామకంపట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement